శ్రీనిధికి మిస్, సాయిపల్లవికి హిట్ – సీత పాత్రకు పలు మలుపులు!

Share


“ప్రతి అన్నం మెతుకుపై తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే చెప్పలేదు” — ఈ మాట సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంత వర్తిస్తుందో తాజా ఉదాహరణగా నిలుస్తోంది బాలీవుడ్ ‘రామాయణ’ చిత్రం. బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్, గ్రాండియర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీత పాత్రకు సాయిపల్లవి ఎంపికైన సంగతి తెలిసిందే.

కానీ ఈ పాత్ర కోసం జరిగిన పోటీ మాత్రం ఆసక్తికరమే. ‘కేజీఎఫ్’, ‘హిట్ 3’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కూడా ఈ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చింది. రెండు మూడు కీలక సీన్లను ప్రాక్టీస్ చేసి, తన నటనను ప్రదర్శించింది. అలియా భట్ కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, సీత పాత్ర అభినయమే ప్రాధాన్యం కలిగిన క్యారెక్టర్ కావడంతో, దర్శకుడు నితేశ్ తివారి సాయిపల్లవిని ఎంచుకున్నారు.

ఈ ఆడిషన్‌లు కేజీఎఫ్ 2 రిలీజ్ సమయంలో జరిగాయని శ్రీనిధి తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే సమయంలో యష్ రావణుడిగా నటించనున్నట్టు తెలిసి, తనకు అవకాశం వస్తే “కేజీఎఫ్ జంట ఇప్పుడు రామాయణంలో శత్రువుల్లా కనిపిస్తే?” అన్న ఊహలో కాసేపు ఆనందించిందట. కానీ ఆ ఛాన్స్ చివరికి వేరొకరికి వెళ్లింది.

ఇక కెజిఎఫ్ ఘనవిజయం తర్వాత శ్రీనిధి కెరీర్ అంత స్పీడుగా సాగలేదనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నాని సరసన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ చిత్రంతో పాటు, సిద్ధు జొన్నలగడ్డ తోనూ ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. హిట్ 3 సినిమాపై మంచి నమ్మకంతో ఉన్న శ్రీనిధి, నానితో కలిసి ముంబయ్ నుంచి కోచి దాకా ప్రమోషన్‌ల్లో చురుకుగా పాల్గొంటోంది.

ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమని యూనిట్ వర్గాల టాక్. కథలో ఓ మేజర్ ట్విస్ట్ ఆమె క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని సమాచారం. అందుకే ట్రైలర్ తప్ప ఎలాంటి వీడియోలు రిలీజ్ చేయకుండా, కథపై స్పాయిల్స్ రాకుండా టీం జాగ్రత్తలు తీసుకుంటోంది.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో కథలో ఒక భాగాన్ని జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గామ్ ప్రాంతంలో చిత్రీకరించారు.


Recent Random Post: