షారూఖ్ ఖాన్: ఇన్ సైడ‌ర్-ఔట్ సైడ‌ర్ డిబేట్‌పై సందేశం

Share


సినీప‌రిశ్ర‌మ‌లో ఇన్ సైడ‌ర్ – ఔట్ సైడ‌ర్ డిబేట్ చాలా కాలంగా కొనసాగుతోంది. ప్రతి సారి నటవారసులు తెరపై కనిపించగానే ఈ చర్చ పుట్టుకొస్తుంది. కానీ దీనిని వ్యతిరేకించే స్వ‌రాలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా వేవ్స్ 2023 స‌మ్మిట్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఈ అంశాన్ని తనదైన రీతిలో రుచి చూపించారు.

”నేను పరిశ్రమ వెలుపల నుంచి వచ్చాన‌ని” అంటూ షారూఖ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ”ఆకలి, ఆశయం, కృషి వంటి పదాలు ఎప్పుడూ రొమాంటిసైజ్ అవుతుంటాయి. మీరు ఎక్కడి నుండి వచ్చారన్నది అంతగా ముఖ్యం కాదు. ముఖ్యమైనది మీరు ఏ ప్రపంచంలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు, ఆ ప్ర‌పంచంలో మీ స్థానం ఎలా నిలుపుకుంటారు అన్నది. అది వ్యాపారం, రాజకీయాలు లేదా సినిమా రంగం ఏదైనా కావచ్చు” అని షారూఖ్ పేర్కొన్నారు.

షారూఖ్ తన సినిమా కెరీర్ ప్రారంభించినప్పుడు, ఇది తన ప్రపంచం అని అతను నమ్మినట్లు చెప్పారు. ”పరిశ్రమ నన్ను ఆహ్వానించింది, స్వీకరించింది” అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు.

తాను ఔట్ సైడ‌ర్‌గా ఉన్నప్పటికీ, శ్ర‌మ, అంకిత‌భావం, ధైర్యం అంటూ ఆయన ఈ స్థాయికి ఎదిగాడు. నేడు ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మాత్రమే కాదు, ప్ర‌పంచంలో నాలుగో అత్యంత సంప‌న్న నటుడిగా రికార్డు సృష్టించాడు. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం 7400 కోట్ల నిక‌ర ఆస్తితో ఒక రికార్డ్ స్థాయిలో ఉన్నాడు.

అయితే, కార్తీక్ ఆర్య‌న్, ఆయుష్మాన్ ఖురానా, కంగన రనౌత్ లాంటి న‌టులు ‘ఔట్ సైడ‌ర్’లు అయినప్పటికీ, వారు కూడా తమ ప్రతిభతో పరిశ్రమలో కీలక స్థానం సంపాదించుకున్నారు.


Recent Random Post: