షోలే 50 ఏళ్ల ప్రత్యేక సంచిక: 4Kలో రీ-рిలీజ్, అన్‌కట్ వెర్షన్‌కు థియేటర్లలో సన్నాహాలు

Share


బాలీవుడ్ మేగాస్టార్ అమితాబ్ బచ్చన్, వెటరన్ హీరో ధర్మేంద్ర కలిసి నటించిన లెజెండరీ మల్టీస్టారర్ చిత్రం ‘షోలే’. భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఈ సినిమాని 1975 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జీపీ సిప్పి నిర్మించగా, ఆయన తనయుడు రమేష్ సిప్పి దర్శకుడిగా చక్కటి దృశ్యకావ్యాన్ని మలిచారు.

ఈ సినిమాతో హేమామాలిని, జయా బచ్చన్, అమ్జాద్ ఖాన్, సంజీవ్ కుమార్ వంటి ప్రతిభావంతులంతా కీలక పాత్రల్లో నటించారు. ఇందులో ధర్మేంద్ర ప్రధాన పాత్రలో కనిపించగా, అమితాబ్ బచ్చన్ సపోర్టింగ్ లీడ్‌గానూ కనిపించారు. కానీ సినిమా విడుదల అనంతరం క్రేజ్ మాత్రం అమితాబ్ బచ్చన్ దక్కించుకున్నారు. ఆయన పోషించిన “జై” పాత్ర సినిమాకు స్పెషల్ హైలైట్ అయింది.

ఆర్.డి.బర్మన్ అందించిన సంగీతం ఇప్పటికీ శ్రోతల మదిలో నిలిచిపోతుంది. ‘షోలే’ సినిమాను ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిపింది దాని స్టోరీ, పాత్రలు, సంగీతం, సాంకేతికత. ఇది ఇప్పటికీ టీవీల్లోనో, థియేటర్లలోనో ఎప్పటికప్పుడు ప్రదర్శించబడుతూ ఉంటుంది. విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే — ఇప్పటివరకు 25 కోట్ల టికెట్లు అమ్ముడైన ఏకైక హిందీ సినిమా ఇదే అని గర్వంగా చెబుతున్నారు.

ఇప్పుడు, ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఈ సినిమాను మళ్లీ 4K రిస్టోరేషన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జూన్ 27న విడుదల కానున్న ఈ ప్రత్యేక ఎడిషన్, ఇటలీ బొలోనాలో జరిగే ప్రముఖ Cinema Ritrovato Festival‌లో ప్రదర్శించనున్నారు. అదీగాక, ఈసారి అన్‌కట్ వెర్షన్నూ స్క్రీన్‌పై చూపించనున్నారు.

ఇక ఈ సినిమాలో నటీనటులకు అప్పట్లో అందించిన పారితోషికాలు ఇప్పుడు వినగానే ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి.

మూవీ మొత్తం బడ్జెట్: రూ.3 కోట్లు

ధర్మేంద్ర పారితోషికం: రూ.1.50 లక్షలు (అత్యధికం)

సంజీవ్ కుమార్: రూ.1.25 లక్షలు

అమితాబ్ బచ్చన్: రూ.1 లక్ష మాత్రమే

హేమామాలిని: రూ.75 వేల

అమ్జాద్ ఖాన్: రూ.50 వేల

జయా బచ్చన్: రూ.35 వేల

ఈ సమాచారం చూస్తే, అప్పటి కాలంలో సినిమాల పరంగా ఎంత గడ్డు పరిస్థితులు ఉండేవో అర్థమవుతుంది. అయినా ‘షోలే’ వంటి మాస్టర్ పీస్‌ను మనకు అందించినందుకు చిత్రబృందానికి నేటికీ సినీ అభిమానులు ఋణపడి ఉంటారు.


Recent Random Post: