
ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు కేవలం తమ నటనతోనే కాదు, అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సినిమాల ద్వారా ఆడియన్స్‌కు, అభిమానులకు దగ్గరవ్వడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా తమ గ్లామర్, సాంప్రదాయ అందాలతోనూ ఫాలోవర్స్‌ను భారీగా పెంచుకుంటున్నారు. ఏ సందర్భమైనా సరే అందంగా ముస్తాబై ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
ఈ క్రమంలోనే నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రముఖ హీరోయిన్ సప్తమి గౌడ ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలలో తన అందంతోనే కాకుండా, సాంప్రదాయ లుక్‌లో మెరిసిపోతూ అందరి హృదయాలను దోచుకుంది.
కన్నడ సినీ పరిశ్రమలో ఎలాంటి అంచనాలు లేకుండా 2022లో విడుదలైన కాంతార చిత్రంతో సప్తమి గౌడకు భారీ గుర్తింపు లభించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత బాలీవుడ్లో ది వ్యాక్సిన్ వార్ చిత్రంలోనూ నటించింది. ఈ క్రేజ్‌తోనే తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమాలో అవకాశం దక్కించుకున్నప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ సప్తమి గౌడ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఆమె తిరిగి తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం కన్నడలో ది రైజ్ ఆఫ్ అశోక్ అనే చిత్రంలో నటిస్తోంది.
నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సప్తమి గౌడ, సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు హార్స్ రైడింగ్, క్యూట్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లంగా వోణీలో ఎంతో అందంగా కనిపిస్తూ, చేతిలో పువ్వుతో చిరునవ్వు చిందిస్తూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు “అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంది”, “అందం గురించి ఎంత చెప్పినా తక్కువే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ ఫోటోలు ఆమె ఇంటి వద్ద తీసిందా? లేక సినిమా షూటింగ్ సెట్లో దిగినవా? అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో సప్తమి గౌడ తెలుగులోనూ మరిన్ని సినిమాల్లో నటించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.
Recent Random Post:















