
‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో హీరో రేంజ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు తన లైఫ్‌స్టైల్‌తోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ దర్శకుడు యూరోపియన్ బ్రాండ్ మినీ కూపర్ కారును తన గ్యారేజీలోకి చేర్చుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన కొత్త మినీ కూపర్ కారును పూజలతో ఇంటికి తీసుకువచ్చిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గ్రీన్ షేడ్‌తో స్టైలిష్‌గా ఉన్న ఈ కూపర్ మోడల్, ఆడి, మెర్సిడెస్లకే పోటీని ఇస్తోందని చెప్పాలి. కార్ ముందు భాగాన్ని పూలతో అలంకరించి, హారతి కార్యక్రమంలో ఆయన సతీమణి పాల్గొనడం ఫోటోల్లో కనిపించింది.
కారును పరిశీలిస్తే, నంబర్ ప్లేట్ TG09 TR 7395గా ఉంది. ముందు భాగంలో తెలుపు రంగోలి డిజైన్, వెనుక భాగంలో మెటాలిక్ గ్రీన్ షేడ్, నల్ల టాప్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఇది ‘కూపర్ S’ లేదా ‘JCW’ మోడల్ కావచ్చని అంచనా. ప్రస్తుతం ఇండియాలో మినీ కూపర్ మోడల్స్ ధర రూ. 42.7 లక్షల నుంచి రూ. 55.9 లక్షల వరకు ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా ఎంపిక చేసిన మోడల్ రూ. 50 లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది.
కార్లు, స్టైల్, క్లాస్ — ఈ మినీ కూపర్‌తో డైరెక్టర్ వంగా మరో స్టేట్మెంట్ ఇచ్చినట్లే అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే హైదరాబాద్‌లో ‘భద్రకాళి పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేశారు. గతంలో సెలబ్రిటీలకే కామన్ అయిన మెర్సిడెస్, BMWల నుంచి మినీ కూపర్‌తో కొత్త ట్రెండ్ సెట్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా!
Recent Random Post:















