
కొన్ని సినిమాల్లో కథ కంటే క్యాస్టింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ సీక్వెల్స్‌లో క్యాస్టింగ్‌కు సంబంధించిన వార్తలు ఎప్పుడూ ఉత్కంఠ రేపుతాయి. ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ప్రత్యేకంగా పంజాబీ స్టార్ హీరోయిన్ నీరూ బజ్వా ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ఫ్యాన్స్‌లో పెద్ద ఉత్సాహం రేకెత్తించాయి. అసలు సన్ ఆఫ్ సర్దార్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాకు రీమేక్ గా వచ్చి మంచి విజయాన్ని సాధించగా, ఈ సీక్వెల్ కూడా బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం, సన్ ఆఫ్ సర్దార్ 2 లో అజయ్ దేవగణ్ భార్యగా నీరూ బజ్వా నటించనున్నారట. పంజాబీ సినీ పరిశ్రమలో నీరూ బజ్వాకు ఉన్న పాపులారిటీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కాబోతోంది. ఈ సినిమా కోసం నీరూ బజ్వా పాత్రను చాలా కీలకంగా తీర్చిదిద్దారని టాక్.
ఇక సౌత్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ఏమి పాత్ర పోషిస్తుందోనన్న దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న మృణాల్, బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఇంకా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తోంది. సన్ ఆఫ్ సర్దార్ 2 ఆమెకు ఆ బిగ్ బ్రేక్ ఇవ్వగలదా అన్నది చూడాలి.
Recent Random Post:















