సమంత ఆశలు పెట్టుకున్న ‘శుభం’ రేపే విడుదల

Share


సమంత నిర్మాతగా మారిన తొలి సినిమా శుభం ఎల్లుండి థియేటర్లలోకి రాబోతోంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌పై సామ్ భారీ నమ్మకంతో ఉంది. ఇప్పటికే ప్రీమియర్ షోల పర్వాన్ని మొదలుపెట్టిన సమంత, గత రాత్రి హైదరాబాద్‌లో ఓ ప్రదర్శన జరిపించగా, ఇవాళ మరిన్ని షోలు జత చేశారు. వైజాగ్‌లో కూడా ప్రత్యేక ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ షోలన్నీ హౌస్‌ఫుల్ కావడం, ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని చూపిస్తోంది.

దర్శకుడు ప్రవీణ్ రూపొందించిన ఈ చిత్రాన్ని సమంత స్వయంగా ప్రమోట్ చేస్తూ, వేర్వేరు కోణాల్లో ప్రచారాన్ని నడిపిస్తున్నారు. వెరైటీ ప్రోమోలు, సెలబ్రిటీ డాన్స్ రీల్స్, వీడియో బైట్స్ లాంటి ప్రాక్టికల్ ప్రచారంతో సినిమా గురించి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక పోటీగా ఉన్న శ్రీవిష్ణు సినిమా సింగిల్ ప్రీమియర్ షోల బాట పట్టకపోయినా, శుభం వెనక ఉన్న రిస్క్ చూసిన వారంతా, ఈ సినిమాపై ఏదో ఉన్నట్టే అనుకుంటున్నారు. నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో సమంత పెట్టిన పెట్టుబడి ఇప్పటికే రికవర్ అయ్యిందని సమాచారం. శాటిలైట్ హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకోగా, ఓటిటి హక్కులు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఓ బేబీ, ఖుషి లాంటి సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి వ్యూస్ సంపాదించడంతో, సమంత బ్రాండ్‌ను నమ్మి పెద్ద మొత్తంలో డీల్ చేసినట్టు సినీ వర్గాల్లో టాక్.

తక్కువ బడ్జెట్‌తో తీసినా, నిర్మాతగా మొదటి అడుగే విజయం కావాలని సమంత ఆశిస్తోంది. ప్రీమియర్ టాక్ ప్రస్తుతం పాజిటివ్‌గానే వినిపిస్తోంది. అయితే, నిజమైన టెస్ట్ రేపటి ప్రేక్షక స్పందనతో తేలనుంది. ఎందుకంటే సినిమా క్యాస్టింగ్ పెద్దగా పాపులర్ కాకపోవడంతో, ఓపెనింగ్స్‌పై తేలికపాటి అనుమానాలున్నాయి. అందుకే సమంత పూర్తిగా ప్రమోషన్లలో నిమగ్నమై, తన క్యామియోను పెద్దగా హైలైట్ చేయకుండా, కంటెంట్ బలముందని చూపించేందుకు ప్రయత్నిస్తోంది.

ఇంట్రెస్టింగ్ గా, శుభం కథలో టీవీ సీరియల్స్ పిచ్చిలో దెయ్యాలుగా మారిన భార్యల నేపథ్యం వినిపిస్తోంది, ఇది ప్రేక్షకుల ఆసక్తిని పెంచేలా ఉంది. మొత్తంగా, శుభం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో రేపటి విడుదలతో తేలనుంది.


Recent Random Post: