సమంత తొలిసారి నిర్మాతగా – ‘శుభం’కు గ్రాండ్ ఎంట్రీ!

Share


ప్రముఖ నటి సమంత తొలిసారి నిర్మాతగా మారి రూపొందించిన సినిమా ‘శుభం’ – ఓ ఆసక్తికరమైన కామెడీ థ్రిల్లర్‌. హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీనివాస్, చ‌ర‌ణ్ పేరి, శ్రియా కొంతం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హించిందీ ప్రవీణ్ కండ్రేగుల.

“మీకు శుభం కలుగుగాక” అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కొత్త జంట పెళ్లి నేపథ్యంలో నడిచే కథలో కామెడీ, థ్రిల్ మిక్స్ చేస్తూ, వినోదాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ట్రైలర్‌పై ఆసక్తి పెరిగిన తరుణంలో చిత్ర బృందం గురువారం ఓ కీలక అప్డేట్‌ను షేర్ చేసింది. ట్రైలర్ ఎప్పుడైనా రిలీజవవచ్చు అంటూ ఓ పోస్టర్‌ను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, అభిమానుల్లో ఉద్వేగం పెరిగింది.

విభిన్నమైన కథ, కొత్త ముఖాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక సమంత నటిగా కూడా బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో నటించడంతోపాటు, దానికి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. అలాగే హిందీలో రాజ్ & డీకే రూపొందిస్తున్న వెబ్ సిరీస్ **’రక్త్ బ్రహ్మాండ్’**లోనూ ముఖ్యపాత్రలో నటిస్తోంది.


Recent Random Post: