సమంత-రాజ్ వివాహంలో తమన్నా హాట్ రూమర్స్

Share


టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత తన సినీ మరియు వ్యక్తిగత జీవితంతో తరచుగా వార్తల్లో ఉంటూ వస్తోంది. సేల్స్ గర్ల్‌గా కెరీర్ మొదలుపెట్టిన సమంత, తరువాత కోలీవుడ్‌లో నటనతో తన ప్రస్థానం ప్రారంభించింది. తెలుగులో ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసింది. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా స్థానం సంపాదించుకుంది.

కెరీర్ పీక్స్‌లో ఉండగా, సమంత అక్కినేని నాగచైతన్యతో ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడంతో వ్యక్తిగత జీవితంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా “ఇంకొకరి వల్ల విడాకులు” అనే రూమర్స్, ఆమెను టార్గెట్ చేసిన యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు, సోషల్ మీడియా చర్చలన్నీ సమంత ఎదుర్కొంది.

పెళ్లి తర్వాత సమంత బాలీవుడ్లో అడుగుపెట్టింది. రాజ్ & డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో నటించగా, అదే సమయంలో రాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కారణంగానే విడాకులు తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

మధ్యలో కొన్ని సినిమాలు పెద్దగా సక్సెస్ కానప్పటికీ, సిటాడెల్ మరియు హనీ బన్నీ వెబ్ సిరీస్‌లతో రాజ్‌తో కలిసి వీరు మళ్లీ కమ్బాక్ ఇచ్చారు. తరువాత వారిద్దరూ చట్టపట్టాలేసుకుని, గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.

తాజాగా సమంత సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. అందులో తన భర్త రాజ్తో పాటు స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా కనిపించారు. ఈ ఫోటోలు వైరల్ అవడంతో, నెటిజన్స్ “తమన్నా కూడా వివాహానికి కారణం” అని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఎంత వాస్తవం ఉందో స్పష్టం కాదు, కానీ ఫోటోలు మరియు రూమర్లు ఈ చర్చలకు కారణమవుతున్నాయి. సమంత లేదా తమన్నా దీనిపై ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.


Recent Random Post: