
స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రస్తుతం సినిమాల్లో బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం, హెల్త్ అప్డేట్స్, ట్రావెల్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది.
ఇక కొంతకాలంగా ఆమె దర్శకుడు రాజ్ నిడమోరుతో రిలేషన్లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి అమెరికాకు వెకేషన్ వెళ్లడం, ఇటీవల ఒకే కారులో కనిపించడం ఆ రూమర్లకు మరింత బలం చేకూర్చింది.
తాజాగా సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త ఫొటోలు ఈ రూమర్లకు మరింత ఆస్కారం కల్పించాయి. కేఫేలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోల్లో రాజ్ కనిపించకపోయినా, అభిమానుల దృష్టి మాత్రం ఆమె వేళ్లపై ఉన్న రింగ్పైనే ఆగిపోయింది.
ఆ ఫొటోల్లో సమంత వేలికి వేసుకున్న రింగ్ ప్రత్యేకంగా కనిపించింది. మధ్యలో ఓవల్ ఆకారంలో స్టోన్ ఉండగా, రెండు వైపులా మెరిసే డైమండ్స్ అమర్చారు. ఇప్పటివరకు ఇలాంటి రింగ్ ధరించని సమంత, ఇప్పుడు కొత్తగా ఇలాంటి రింగ్‌లో కనిపించడం అభిమానుల్లో అనేక ఊహాగానాలకు కారణమైంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటడెల్: హనీ బన్నీ సిరీస్‌ల్లో సమంత కీలక పాత్రలో నటించింది. ఆ సమయంలో రాజ్‌తో సామ్‌కు స్నేహం ఏర్పడి, తరువాత మరింత బలపడిందని టాక్. ఇటీవల సమంత నిర్మించిన శుభం సినిమాకు కూడా రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
అయితే ఈ రూమర్లపై ఇప్పటివరకు సమంత కానీ, రాజ్ నిడమోరు కానీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.
Recent Random Post:















