
స్టార్ హీరోలకు లేడీ అభిమానుల ఫాలోయింగ్ ఎప్పుడూ పీక్స్‌లో ఉంటుంది. అయితే హీరోయిన్లు కూడా స్టార్ల పట్ల అదే స్థాయిలో అభిమానం చూపిస్తారు. సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా, వారు స్టార్లను ఆదర్శంగా తీసుకుంటూ అభిమానాన్ని కొనసాగిస్తుంటారు. తాజాగా కరీనా కపూర్, సల్మాన్ ఖాన్ పట్ల ఎంతగానో అభిమానమో ఓ ఇంటర్వ్యూలో బయటపడింది.
కరీనా చిన్నప్పటి నుండే సల్మాన్ ఖాన్‌కు వీరాభిమానిగా ఉండేది. ఎనిమిదేళ్ల వయసులోనే తన బాత్రూం మొత్తాన్ని సల్మాన్ ఖాన్ ఫోటోలతో అలంకరించిందట. ఈ ఆసక్తికర విషయాన్ని సల్మాన్ స్వయంగా కపిల్ శర్మ షోలో పంచుకున్నాడు. ఆ షోలో ప్రసారం కాని ఒక అన్‌సీన్ పుటేజీని ఇటీవల కపిల్ తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసాడు. అందులో సల్మాన్ ఒక మెన్స్ సలూన్ పోస్టర్ని చూసి హాస్యాస్పదంగా స్పందిస్తారు. ఆ సందర్భంలో కరీనా బాత్రూం ఫోటోలను బయటపెట్టి అందరినీ నవ్విస్తారు.
సల్మాన్ చెబుతూ, “కరీనా ఇంటికి ఒకసారి వెళ్లినప్పుడు, ఆమె బాత్రూం గోడలు మొత్తం నా ఫోటోలతో ఉండేవి. కానీ కరీనా 15వ ఏటికి రాహుల్ రాయ్ ఫోటోలు పెట్టేసిందట!” అని సల్మాన్ నవ్వుతూ చెప్పారు. సల్మాన్-కరీనా జోడీ బాలీవుడ్లో బాడీగార్డ్, క్యూంకీ, బజ్రంగి భాయిజాన్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అభిమానులు ఈ జోడీ మళ్లీ ఒక సినిమాలో కనిపించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Recent Random Post:















