సల్మాన్ ఖాన్ ఫుడ్ ట్రక్ వివాదంపై సత్యం బయటపడింది

Share


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై ఇటీవల కొన్ని విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తాయి. ముఖ్యంగా సికిందర్ సినిమా ఫెయిల్యూర్‌కి సల్మాన్‌ కారణమని దర్శకుడు మురుగదాస్ వ్యాఖ్యలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. మురుగదాస్ తెలిపినట్టు, సల్మాన్ సమయ పాలన సరిగా లేకపోవడం వల్ల సినిమా సక్సెస్‌ కాకపోయింది. ఈ వ్యాఖ్యలు జాతీయ మీడియా చర్చలకు కూడా దారితీసాయి.

గతంలో సల్మాన్ హీరోగా ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు చేసినప్పటికీ, చివరి పది సంవత్సరాల్లో ఆయన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో వచ్చే విమర్శలు, కొందరు హీరోలను టార్గెట్‌ చేయడం సాధారణమని కొందరు అంటున్నారు.

ప్రస్తుతం సల్మాన్ బిగ్‌బాస్ కారణంగా వార్తల్లో ఉన్నాడు. లేకుంటే కొంతమంది ట్రోల్స్, ప్రజలు సల్మాన్‌ను మరిచి పోతారని కామెంట్ చేస్తున్నారు. కొన్ని వార్తల్లో ఆయన షూటింగ్‌కు రాత్రిపూట రావడం, తాగి రావడం, ఫుడ్‌ కోర్ట్‌ను కూడా వెంట తీసుకోవడం, ఎక్కువ సమయం తినడానికి కేటాయించడం వంటి విషయాలు పేర్కొన్నప్పటికీ, సల్మాన్ ఖాన్‌ కాంపౌండ్ ఇప్పటికే దీన్ని ఖండించింది.

అసలు నిజం ఏమిటంటే, సల్మాన్ సెట్స్‌లో బీయింగ్ హంగ్రీ ఫుడ్ ట్రక్ మాత్రమే ఉపయోగిస్తారు, అందులో తినే ప్రతి ఆహారం ఖర్చును ఆయన స్వయంగా చూసుకుంటారు. నిర్మాతలు ఈ ఖర్చును భరించాల్సిన పరిస్థితి లేదు. ఈ విషయంపై పీయూష్ భగత్, షాజియా సమ్‌జీ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు కూడా స్పందించారు. వారు సల్మాన్‌తో పని చేసిన అనుభవం ఆధారంగా, సల్మాన్ సెట్స్‌లో తనతో పాటు ఉన్న చాలా మంది స్టాఫ్‌కు కూడా ఆ ఫుడ్ ట్రక్‌లోనే భోజనం ఏర్పాటు చేస్తారని తెలిపారు.

ఇప్పటివరకు సల్మాన్ ఫుడ్ ట్రక్ ఖర్చు గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చారు. అలాగే, గతంలో అమీర్ ఖాన్ డ్రైవర్ ఖర్చులు నిర్మాతల నుంచి వసూలు చేస్తాడన్న ప్రచారం కూడా అబద్ధమని కొరియోగ్రాఫర్లు తెలిపారు. అమీర్ ఒకసారి తన డ్రైవర్ జీతాన్ని ఎందుకు నిర్మాత చెల్లించాలి అని ప్రశ్నించిన విషయం గుర్తు చేశారు.

కాగా, కరణ్ జోహార్ ఒక చిట్‌చాట్‌లో పేర్కొన్నట్టు, స్టార్ హీరోలు తమ వ్యక్తిగత సిబ్బంది ఖర్చులను కొన్నిసార్లు నిర్మాతలపై వేస్తున్నారని, లేకపోయినా ఫిక్స్ చేసిన ఖర్చులను నిర్మాతలతో షేర్ చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే హీరోలపై ఈ రకమైన ప్రచారం జరుగుతూనే ఉంది.


Recent Random Post: