సల్మాన్ వ్యాఖ్యలపై నాని స్పందన: థియేటర్‌కి రావాలంటే కథ అవసరం

Share


నేచుర‌ల్ స్టార్ నాని, తన తాజా చిత్రం హిట్ 3 ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటూ మీడియాతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల సికిందర్ ప్రమోషన్స్‌లో సౌత్ ఆడియన్స్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా నాని స్పందించాడు.

సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ – “నాకు సౌత్ ఆడియన్స్ రోడ్ మీద కనిపిస్తే ‘భాయ్ భాయ్’ అంటూ ప్రేమగా పలకరిస్తారు. కానీ వాళ్లు థియేటర్లకు మాత్రం రావ‌డం లేదు. అదే సమయంలో రజినీకాంత్, చిరంజీవి, సూర్య వంటి సౌత్ హీరోల సినిమాలను మనం (బాలీవుడ్ ఆడియన్స్) థియేటర్లకు వెళ్లి చూస్తున్నాం,” అంటూ వ్యాఖ్యానించాడు.

ఈ కామెంట్లపై నాని స్పందిస్తూ – “మన ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే, వారికి కథతో కనెక్ట్ అవ్వాలి. భాష కన్నా, స్టార్డమ్ కన్నా కథ ముఖ్యం. మనం ఎమోషన్స్‌ను బాగా చూపించగలిగితే, ప్రేక్షకుడు ఖచ్చితంగా థియేటర్‌కి వస్తాడు,” అంటూ బలమైన పాయింట్ చెప్పారు.

నాని స్టైల్లోనే బాగా బ్యాలెన్స్ చేస్తూ, సల్మాన్ కామెంట్‌కు ఘాటుగా కాకుండా బుద్ధిగా స్పందించినట్టు కనిపిస్తోంది.


Recent Random Post: