పాఠ్య పుస్తకాల్లో సినిమా స్టార్ గురించా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నమ్మాల్సిన నిజం అవును. అదీ స్టేట్ సిలబస్ పుస్తకాల్లో కాదు..ఏకంగా సీబీఎస్ సిలబస్ పుస్తకాల్లోనే ఓ సినిమా నటుడు గురించి ఏకంగా ఓ చాప్టరే ఉంది. దానిపై ఏటా పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి విద్యార్ధులు సమాధానాలు ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? అంటే కేవలం ఆ నటుడి ఎదిగిన విధానాన్ని బట్టి విద్యార్ధులకు ఇలాంటి స్పూర్తి నింపే వ్యక్తుల జీవితాలు పాఠ్యాంశంగా మలిస్తే బాగుంటుంది అన్న ఆలోచన నుంచే పాఠ్యాంశంగా మారి నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఎవరా స్టార్? ఏ క్లాస్ లో ఆ స్టార్ గురించి చాప్టర్ ఉంది అంటే ? వివరాల్లోకి వెళ్లాల్సిందే. అతను ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్. అవును ‘ప్రమ్ బస్ కండెక్టర్ టూ ఫిల్మ్ స్టార్’ పేరుతో సీబీఎస్ ఈ లో ఆరో తరగతి విద్యార్ధులకు రజనీకాంత్ జీవితం ఓ పాఠంగా ఉంది. ఇలా ఓ సినీ నటుడు జీవితం పాఠంగా మలచడం అన్నది రజనీకాంత్ కే చెల్లింది. ఎంతో మంది భారతీయు నటులున్నా ఆ అరుదైన అవకాశం రజనీకాంత్ లైఫ్ స్టైల్ కే దక్కడం గొప్ప విశేషం.
ఆ లెజెండరీ గురించి మరిన్ని విశేషాలు.. బెంగుళూరులోని ఓ గుడిలో రజనీకాంత్ కూర్చుని ఉండగా అక్కడున్న యాచకులు ఆయన చేతిలో డబ్బులు వేశారుట. ఆ సంఘటన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ నేనేంటో ఆ సంఘటన తెలియజేస్తుంది. అందుకే పైపై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వను అన్నడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే `దళపతి` సినిమా షూటింగ్ సమయంలో అరవింద్ స్వామి తనకు తెలియక రజనీకాంత్ రూమ్ కి వెళ్లి బెడ్ మీద పడుకున్నారు.
గాఢ నిద్రలో ఉన్న అరవింద్ స్వామిని నిద్రలేపడం ఇష్టం లేక అదే గదిలో నేలపై పడుకున్నారు రజనీ. అప్పటికి అంతగా గుర్తింపులేని తన విషయంలో రజనీ అలా వ్యవహరించడంతో ఆశ్యర్యపోవడం అరవింద్ స్వామి వంత్తైంది. రజనీకాంత్ సంపాదనలో 50 శాతం సేవా కార్యక్రమాలకే కెటాయిస్తున్నారు. రజనీకాంత్ కి ఎప్పటికైనా హిమాలయాల్లో స్థిరపడాలనేది కోరిక.
Recent Random Post: