సూర్య-వెట్రిమారన్ వాడివాసల్ రద్దా?

Share


సూర్య హీరోగా, వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన వాడివాసల్ సినిమాపై గత కొంతకాలంగా తీవ్రమైన ఆసక్తి నెలకొంది. జల్లికట్టు నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా మొదటి లుక్‌ ను విడుదల చేసినప్పటినుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వెట్రిమారన్‌ సినిమాలకు ఉన్న ప్రత్యేక క్రేజ్, సూర్య క్రాఫ్ట్‌ తో ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యేకతను సంతరించుకుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం వాడివాసల్ ప్రాజెక్ట్‌ కు బ్రేక్‌ పడినట్టుగా తెలుస్తోంది. ప్రారంభంలో విడుదల పార్ట్‌ 1, పార్ట్‌ 2 చిత్రాల తర్వాత ఈ సినిమా షురూ అవుతుందని ఊహించారు. కానీ సూర్య ప్రస్తుతం కంగువా మరియు బాలాజీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న నేపథ్యంలో వాడివాసల్పై అనిశ్చితి నెలకొంది.

ఇందుకు తోడు వెట్రిమారన్‌ తాజాగా శింబుతో కొత్త సినిమాకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ కాంబో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందన్న టాక్‌ తోపాటు, నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇక శింబు ప్రస్తుతం రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ దర్శకత్వంలో సినిమా చేస్తూ, తదుపరి రెండు మూడు ప్రాజెక్టులకు సైన్‌ చేసినట్టు సమాచారం. వాటిలో ఒకటి వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఉండబోతోందనే వార్తలతో వాడివాసల్ కథను ఇప్పుడు శింబు కోసం మలచినట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇదే నిజమైతే, సూర్య-వెట్రిమారన్‌ కాంబోను ఎదురుచూసిన అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే. సూర్య వెట్రిమారన్ సినిమా పూర్తిగా రద్దు అయిందా? లేక తాత్కాలికంగా వాయిదా పడిందా? అన్న దానిపై స్పష్టత అవసరం. ఏదేమైనా, శింబుతో వెట్రిమారన్‌ సినిమా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ వార్తలపై మరింత క్లారిటీ రావడం గట్టిగా ఎదురుచూడాల్సిందే.


Recent Random Post: