హిట్ కోసం గ్యాప్ తీసుకున్న వైష్ణవ్ తేజ్

Share


‘ఉప్పెన’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్‌ ను ఎదుర్కొంటూ కెరీర్‌లో కాస్త వెనక్కి పడిపోయాడు. ‘ఉప్పెన’ హిట్ తరువాత వచ్చిన మూడు సినిమాలు పెద్దగా క్లిక్ కాకపోవడంతో, చివరగా వచ్చిన ఆది కేశవ కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో వైష్ణవ్ తేజ్ కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈసారి మాత్రం తను ఎలాంటి సినిమా చేస్తే అది తప్పకుండా హిట్ కావాలని, అందుకే జాగ్రత్తగా కథల ఎంపికలో ఉన్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ లను నిశితంగా వింటూ, సరైన కథ దొరికే వరకు వెయిట్ చేయడమే తన ప్రాధాన్యత అని చెప్పుకొచ్చాడు. మొదటి సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో, ఆ స్థాయి మళ్లీ అందుకోవాలంటే మంచి కథలే సరైన మార్గమని వైష్ణవ్ భావిస్తున్నాడు.

ఇక ఈ గ్యాప్‌ లో ఆయనపై రకరకాల వార్తలు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా, ఈసారి ఓ అందరికీ నచ్చే కంటెంట్‌తో తిరిగి స్క్రీన్‌పై కనిపించాలన్న లక్ష్యంతో ఉన్నాడు. కథ ఎంపిక, కాంబినేషన్, మార్కెట్ టెస్టు వంటి విషయాల్లో పూర్తి స్పష్టతకు రాలేకపోయిన గతం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీలోకి చూస్తే వరుణ్ తేజ్ కూడా ఇదే తరహాలో కెరీర్ స్ట్రగుల్‌లో ఉన్నారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా ఆ దారిలోనే, ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం యువ హీరోలు అన్నీ న్యూ ఏజ్ కథలతో ఆకట్టుకుంటుండటంతో, వైష్ణవ్ కూడా అలాంటి సినిమాలు చేయాలని చూస్తున్నాడట.

ఈసారి తీసుకుంటున్న గ్యాప్, ఆయన్ను సరైన దారిలో తీసుకెళ్తుందా..? మెగా అభిమానులు ఆశిస్తున్న విధంగా ఆయన రీ-ఎంట్రీ హిట్ అవుతుందా..? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. మరి వైష్ణవ్ తేజ్ ఎప్పుడు మళ్లీ సెట్ మీదకి వస్తాడో, అది ఎలా ఉండబోతుందో వేచి చూడాలి!


Recent Random Post: