హీరో ఫేస్‌ పెట్టుకుని రూ.7 కోట్లు టోకరా!

టెక్నాలజీ అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ మోసాలకు కూడా కొత్త కొత్త టెక్నిక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఆందోళనకర విషయమేమిటంటే, ఇవి ఎక్కువగా ఉన్నత చదువులు చదువుకున్నవారినే బలి చేస్తుండటమే. ఒకప్పుడు చదువు రాని వారిని మోసం చేయడం సులభం అనుకునేవారు. ఇప్పుడు చదువుకుని టెక్నాలజీని ఉపయోగించేవారే ఈజీగా మోసపోతున్నారు.

ఇటీవల డిజిటల్ అరెస్ట్‌ అనే కొత్త మోసం పద్ధతి ఇండియాలో చర్చనీయాంశమైంది. ఈ స్కామ్ వల్ల చాలా మంది కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరింతగా మోసాలకు మార్ఫింగ్, ఏఐ ఫేస్‌ రీ క్రియేట్‌ వంటి టెక్నాలజీలను వాడుతున్నారు. సినిమా స్టార్స్, రాజకీయ నాయకుల ఫోటోలను మార్ఫ్ చేసి, పబ్లిక్‌ను మోసం చేసే ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తాజాగా హాలీవుడ్‌ స్టార్‌ బ్రాడ్‌ పిట్ పేరుతో జరిగిన ఘరానా మోసం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. 53 ఏళ్ల ఫ్రెంచ్‌ మహిళకు స్కామర్‌ ఆన్‌లైన్‌ ద్వారా తాను బ్రాడ్‌ పిట్‌నని పరిచయం చేసుకున్నాడు. మొదట ఆమె అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, ఏఐ టెక్నాలజీతో తయారుచేసిన ఫోటోలు, వీడియోలు పంపి ఆమెను పూర్తిగా నమ్మించాడు.

తాను ఏంజెలినా జోలీతో విడాకులు తీసుకుంటున్నానని, కేన్సర్ చికిత్స కోసం డబ్బు అవసరమని చెప్పి, విడతల వారీగా ఆమె నుండి ఏకంగా రూ.7 కోట్ల రూపాయలను నొక్కేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఫేక్ ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ స్కామర్‌ నాటకం ఆడాడు. చివరకు ఆ మహిళ విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యింది. తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.


Recent Random Post: