
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగురాష్ట్రాల్లో భారీగా విడుదలకానుండటంతో, తెలుగులోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్రైలర్‌కి వచ్చిన సూపర్ రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు.
ఇటీవల ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న హృతిక్ రోషన్ తన కెరీర్‌లో మిస్ అయిన కొన్ని సూపర్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసారు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
హృతిక్ రోషన్ మొదటగా ‘దిల్ చాహ్తా హై’ సినిమా చేయాల్సి వచ్చిందట. 2001లో ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చాన్స్ తొలుత హృతిక్ దగ్గరకు వచ్చినా, కొన్ని కారణాల వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. ఆ సినిమా అమీర్ ఖాన్‌కి వెళ్లి భారీ హిట్ అందుకుంది. దానిని తలచుకుంటూ హృతిక్ మాట్లాడుతూ – “ఆ సినిమాను చేయలేకపోయినందుకు నిజంగా బాధగా ఉంటుంది. అద్భుతమైన కథను కోల్పోయానన్న భావన ఎప్పుడూ ఉంటుంది” అన్నాడు.
అలాగే, మరో బిగ్ మిస్ – ‘3 ఇడియట్స్’. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ సినిమాలో కూడా హృతిక్ మొదటికి అనుకున్నారట. కానీ కథ చర్చల సమయంలోనే కొన్ని ఇబ్బందుల కారణంగా ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ ప్రాజెక్ట్‌కి అమీర్ ఖాన్ వచ్చి మరోసారి హిస్టారిక్ హిట్ చేశాడు.
“ఆ రెండు సినిమాలను కోల్పోవడం బాధ కలిగించినప్పటికీ, అమీర్ ఖాన్ లాంటి గొప్ప నటుడు వాటిని చేయడం వల్ల అవి ఎంతటి ఘన విజయం సాధించాయో చూస్తే సంతోషమే అనిపిస్తుంది” అని హృతిక్ అన్నారు.
ప్రస్తుతం ఆయన నటించిన వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే ఇది ఖచ్చితంగా ₹1000 కోట్ల క్లబ్ లో చేరే సినిమా అవుతుందని అంటున్నారు. హృతిక్ మాట్లాడుతూ – “వార్ 2 గత సినిమాల కన్నా గొప్ప విజయాన్ని అందిస్తుంది అనే నమ్మకం ఉంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Recent Random Post:















