
అక్కినేని అఖిల్ కెరీర్ విషయంలో ఈసారి మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ‘ఏజెంట్’ ఇచ్చిన ఎదురుదెబ్బ నుంచి బయటపడి, ప్రస్తుతం ‘లెనిన్’ చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే ఈ సినిమా పూర్తికాక ముందే, తన తదుపరి ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా సెట్ చేసుకునే పనిలో ఉన్నారన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన సమాచార ప్రకారం, అఖిల్ ఒక టాప్ డైరెక్టర్‌తో టచ్‌లో ఉన్నట్టు, వీరిద్దరూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నివాసంలో జరిగిన ప్రైవేట్ గ్యాదరింగ్‌లో కలుసుకున్నట్టు టాక్ నడుస్తోంది. ఆ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉండటంతో, ఈ మీటింగ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
అసలు విషయం ఏంటంటే—అఖిల్ వచ్చే సినిమా ప్రశాంత్ నీల్ కాంపౌండ్ నుంచి రావచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరెక్షన్ నీల్ చేయకపోయినా, ఆయన దగ్గర పని చేసిన ఒక అసోసియేట్ డైరెక్టర్‌ను అఖిల్‌కు రికమండ్ చేసినట్లు తెలుస్తోంది. నీల్ పర్యవేక్షణలో పనిచేసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్, మాస్ మరియు హై-ఓల్టేజ్ యాక్షన్‌కు ప్రాధాన్యం ఇచ్చే స్టైల్‌ను ఫాలో అవుతారని ఇండస్ట్రీ టాక్.
అఖిల్ కూడా కొంతకాలంగా ఒక స్ట్రాంగ్ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ శిష్యుడితో సినిమా చేసే అవకాశం రావడం, అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. నీల్ స్టైల్‌కు తగ్గట్లుగా అఖిల్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధమవుతోందని అవగాహన.
‘లెనిన్’ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఇదే కావచ్చనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా ఈ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సాక్షిగా బీజం పడిందనే టాక్ రావడంతో, అక్కినేని ఫ్యాన్స్‌లో గూస్‌బంప్స్ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Recent Random Post:















