అఖిల్ మాస్ అవతారం: లెనిన్‌తో కమర్షియల్ టార్గెట్!

Share


అక్కినేని యువ హీరో అఖిల్ తన 6వ సినిమాగా ‘లెనిన్’ ను అధికారికంగా ప్రకటించారు. మురళి కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజర్‌తోనే సినిమాను హైప్‌ చేయడం చూస్తే, ఇది అఖిల్‌కు కీలకంగా మారబోతుందనే విషయం స్పష్టమవుతోంది.

మాస్ లుక్, పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌తో వచ్చిన టీజర్‌కి అఖిల్ అభిమానులతో పాటు జనాల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే ఈ సినిమా వెనుక అసలైన మెంటార్ మాత్రం కింగ్ నాగార్జున అని ఫిలింనగర్ టాక్. ‘ఏజెంట్’ ఫ్లాప్ తరువాత డీప్రెషన్‌లోకి వెళ్లిన అఖిల్‌ను మళ్లీ రీబిల్డ్ చేయడానికి నాగార్జున స్వయంగా కథ, కాంబినేషన్, ప్రొడక్షన్ మెటీర్లపై పూర్తి స్థాయిలో గమనిస్తున్నాడట.

ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు కథ ఎలా ఉండాలి, సినిమా ఎలా తీస్తే హిట్ అవుతుంది అన్న ప్లానింగ్‌ని నాగార్జున తానే పర్సనల్‌గా చూసుకున్నాడట. షూటింగ్ కూడా సైలెంట్‌గా మొదలుపెట్టి, టీజర్‌ విడుదలతో సినిమాని బయటపెట్టడం గమనార్హం.

ఇక ‘లెనిన్’ తర్వాత అఖిల్ యువి క్రియేషన్స్ లేదా హోంబలే ఫిలిమ్స్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశముందన్న ఊహాగానాలున్నాయి. కానీ అది లెనిన్ పూర్తయ్యాకే మొదలవుతుంది. ఫిల్మ్ నఘర్‌లో ఇప్పుడంతా ఇదే ప్రశ్న – లెనిన్ అఖిల్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?


Recent Random Post: