
పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, అందరి అంచనాలను మించుతూ బన్నీ తన తరువాతి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
వాస్తవానికి, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. దాని ప్రకటన కూడా జరిగింది. కానీ మధ్యలో అట్లీ ప్రాజెక్ట్ రావడంతో, బన్నీ త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి ముందు అట్లీతో పని చేయాలని ఫైనల్ చేశాడు. అట్లీ–అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెంటనే పెద్ద స్థాయిలో హైప్ ఏర్పడింది.
ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉండటంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ కెరీర్లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవ్వగానే షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్లో భాగంగా బన్నీ దాదాపు మూడు నెలలపాటు ముంబైలో ఉండబోతున్నాడు. అల్లు అర్జున్ కెరీర్లో ఇదే అతిపెద్ద అవుట్డోర్ షూట్ అని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్లో అట్లీ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక అల్లు అర్జున్‌తో పాటు యూనిట్ మొత్తం అమెరికా వెళ్లి అక్కడ విఎఫ్ఎక్స్కి సంబంధించిన సీన్స్ చిత్రీకరించనున్నారట. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోణె హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాలో అట్లీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
Recent Random Post:














