
అనన్య పాండే ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్ ఫోటోలు అలరిస్తున్నాయి. సాధారణంగా గ్లామర్ లుక్స్‌తో హీట్ పెంచే ఈ బ్యూటీ, అకస్మాత్తుగా చీరకట్టులో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆరెంజ్ కలర్ సిల్క్ శారీతో పాటు అదే షేడ్ బ్లౌజ్లో మెరిసిన అనన్య, సరదాగా ఇచ్చిన ఫోజులతో అభిమానుల హృదయాలను దోచుకుంది. ఇంత ట్రెడిషనల్‌గా ఆమెను ఎప్పుడూ చూడలేదని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు బుట్టబొమ్మలా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కెరీర్ విషయానికి వస్తే, అనన్య హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె తాత శరద్ పాండే ఒక ప్రసిద్ధ హార్ట్ సర్జన్. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా సినీ ప్రయాణం మొదలుపెట్టిన అనన్య, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వచ్చిన పతీ పత్నీ ఔర్ వో కూడా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు దక్కాయి.
తెలుగులో ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా లైగర్. భారీ అంచనాల మధ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో చేసిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్‌గా మారింది. దీనితో తెలుగులో అవకాశాలు తగ్గినా, ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మరోవైపు ఆమె సోదరుడు అహాన్ పాండే కూడా సయారా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
Recent Random Post:















