ఇటీవల బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో సౌత్ ఇండియన్ సినిమా విజయాన్ని ప్రశంసించారు. అయితే, మరోవైపు ఆయన మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు మాత్రం విభిన్నంగా స్పందిస్తూ, దక్షిణాది సినిమాలపై విమర్శలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తాజా ఇంటర్వ్యూలో సౌత్ వర్సెస్ బాలీవుడ్ చర్చలో పాల్గొన్న కిరణ్ రావు, బాలీవుడ్ చిత్రాలు దేశవ్యాప్తంగా ఉన్న విస్తృత ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంటాయి, కానీ దక్షిణాదిలో కథలు పరిమిత ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు.
కిరణ్ రావు అభిప్రాయాన్ని సవాల్ చేస్తున్న సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలు దేశవ్యాప్త ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రూపొందుతున్నప్పటికీ, హిందీ మార్కెట్‌లో కూడా కొన్ని పెద్ద చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోతున్నాయి. అయితే, సౌత్‌లో రూపొందిన మసాలా చిత్రాలు కేవలం స్థానిక ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఉత్తరాదిలోనూ భారీ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. దానికి RRR, KGF, పుష్ప వంటి చిత్రాలే నిదర్శనం. బాలీవుడ్ కథానిర్మాణంలో మూలాలను వదిలేసి ప్రయోగాత్మక చిత్రాలను రూపొందిస్తున్నప్పటికీ, వాటికి ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కడం లేదు. ఇదే విషయాన్ని అమీర్ ఖాన్ గుర్తించి విశ్లేషించగా, కిరణ్ రావు మాత్రం విభిన్నంగా అభిప్రాయపడ్డారు.
సౌత్ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన “కల్కి 2898 AD” ప్రపంచ స్థాయిలో అంచనాలు పెంచుకున్న చిత్రం. ఇదొక యూనివర్సల్ స్టోరీ. అంతేకాదు, SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, RRR వంటి చిత్రాలు హాలీవుడ్ స్థాయిలో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF, KGF 2 చిత్రాలు కూడా అదే కోవకు చెందుతాయి.
ఈ నేపథ్యంలో, కిరణ్ రావు వ్యాఖ్యలు దక్షిణాది సినిమాల ప్రాబల్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, అమీర్ ఖాన్ మాత్రం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని, సౌత్ సినిమాల విజయానికి సరైన విశ్లేషణను అందించారు.
సౌత్ సినిమాలపై విమర్శలు చేయడం కన్నా, కిరణ్ రావు తన తదుపరి చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో రూపొందించి, బాలీవుడ్ సత్తా చూపించాలి. అసలు విషయంలోకి వస్తే, దక్షిణాది సినిమా ఎందుకు దేశవ్యాప్త ప్రేక్షకులను ఆకర్షిస్తోంది? అన్నది బాలీవుడ్ దర్శకులు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం.
Recent Random Post: