అల్లు అర్జున్ – అట్లీ సినిమా: పునర్జన్మ కాన్సెప్ట్ టచ్?

Share


టాలీవుడ్‌లో పునర్జన్మ కాన్సెప్ట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వ జన్మ తాలూకు జ్ఞాపకాలు, తిరిగి పుట్టిన తర్వాత వాటితో ముడిపడి సాగే కథలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. మూగ మనసులు నుండి మగధీర, మనం వరకు ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్‌లు ఈ జానర్‌లో వచ్చాయి. అయితే ఇటీవల ఎవరూ ఈ కాన్సెప్ట్‌ను టచ్ చేయలేదు.

అయితే, తాజా లీక్ సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ – అట్లీ కలయికలో రాబోయే ప్యాన్ ఇండియా మూవీలో ఈ పునర్జన్మ ఎలిమెంట్ ఉండొచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందుగా బన్నీ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ తాజా బజ్ ప్రకారం, అది ఒకే వ్యక్తి రెండు జన్మల్లో కనిపించే పాత్రగా ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కి పీరియాడిక్ సెటప్ ఉండబోతున్నప్పటికీ, ఇది మగధీరలా రాజులు, యుద్ధాల నేపథ్యంలో కాకుండా, సగటు కమర్షియల్ బ్యాక్‌డ్రాప్‌లో అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో మలచిన కథగా ఉండబోతోందట. ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. పుష్ప 2 తర్వాత వచ్చే భారీ సినిమా కావడంతో ఏ చిన్న విషయానికీ రాజీ పడట్లేదు. అట్లీ స్టైల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ సినిమా బడ్జెట్ ₹300 కోట్లకు పైగా ఉంటుందని టాక్. దీనిని సన్ పిక్చర్స్ – గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం.

అన్నీ కుదిరితే ఏప్రిల్ 8, బన్నీ పుట్టినరోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


Recent Random Post: