
సెట్స్‌పై స్టార్ సినిమాల హంగామా ఎప్పటిలాగే టాప్ గేర్‌లో సాగుతోంది. కొంతమంది ఫిల్మ్ టీమ్స్ రోజూ ఏదో ఒక అప్డేట్, లీక్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తాము నిర్ణయించిన సమయానికే ప్రమోషన్స్ ప్రారంభించి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
ఓ వైపు ప్రభాస్–సందీప్ వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమా నుంచి వాయిస్ నోట్ వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చింది. మహేష్ బాబు–రజమౌళి సినిమా SSMB29 నవంబర్ బ్లాస్ట్‌కి సిద్ధమవుతోంది. రామ్ చరణ్ పెద్ది నుంచి రిలీజ్ చేసిన సాంగ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా మారింది. ఇలా ప్రతి స్టార్ తన సినిమాల అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఆనందపరుస్తున్న సమయంలో, అల్లు అర్జున్ మాత్రం కొంత సైలెంట్‌గా ఉన్నాడు.
అట్లీ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అల్లు అర్జున్–దీపికా పడుకోనే కాంబినేషన్ సినిమా భారీ అంచనాలు రేపుతోంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన లీక్‌లు, కొత్త పోస్టర్లు లేదా వీడియోలు ఏవీ రాలేదు. చివరిసారిగా దీపిక పదుకోనేని హీరోయిన్‌గా అనౌన్స్ చేసిన వీడియో తర్వాత టీమ్ పూర్తిగా షూటింగ్‌లోనే బిజీగా ఉంది.
ఇక పాన్ ఇండియా సినిమాలన్నీ వరుసగా తమ అప్డేట్స్ రిలీజ్ చేస్తుండటంతో, బన్నీ ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమా నుంచి ఒక గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. పుష్ప 1 & 2 సినిమాలతో నేషనల్ లెవెల్‌లో క్రేజ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్, ఈసారి అట్లీ సినిమా ద్వారా ఆ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.
సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ప్లాన్ అవుతున్నాయని సమాచారం. ఇండియన్ సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకుంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల బజ్ మధ్యలో అల్లు అర్జున్ కూడా తన సినిమా నుంచి ఒక స్మాల్ అప్డేట్ ఇస్తే, ఫ్యాన్స్ మాత్రం ఆ ఉత్సాహంతో సోషల్ మీడియా షేక్ చేసే అవకాశమే ఎక్కువ.
Recent Random Post:















