
పుష్ప 2 పాన్ ఇండియాలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులను సృష్టించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ నటనకు విశేషమైన ప్రశంసలు దక్కాయి. పుష్పరాజ్‌గా ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై పూర్తిగా దృష్టి పెట్టారని సమాచారం.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఆయన ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కేటాయించబడింది. ఇన్నోవేటివ్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ ప్రక్రియ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. త్వరలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి తుది స్క్రిప్ట్‌ను ఖరారు చేయనున్నారు.
ఈ చిత్రం 2025 వేసవిలో సెట్స్ పైకి వెళ్లనుందనీ, భారీ సెట్స్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. కథలో వినూత్నతతో పాటు, ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
ఇప్పటివరకు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడంతో, ఇప్పుడు ఈ కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయనుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
అల్లు అర్జున్ తన పాత్రకు తగినట్లుగా బాడీ లాంగ్వేజ్, మాండలికంపై ప్రత్యేకంగా పని చేయనున్నారని సమాచారం. స్క్రిప్ట్ ఎంపిక నుంచి బడ్జెట్ వరకు ప్రతిదీ మెరుగ్గా ఉండేలా చిత్రబృందం కృషి చేస్తోంది. వినూత్న కథ, భారీ ప్రొడక్షన్ విలువలతో ఈ సినిమా మరోసారి అల్లు అర్జున్‌కు భారీ విజయాన్ని తెస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Recent Random Post:















