
పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, డీ-గ్లామర్ లుక్‌లో కనిపించినా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ పాత్ర కోసం మూడున్నరేళ్ల పాటు శ్రమించిన బన్నీ, తన కష్టానికి తగిన ఫలితాన్ని అందుకున్నారు. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ మరింత స్టైలిష్‌గా, గ్రాండ్‌గా ఉండబోతుందని టాక్. అందుకే ఇటీవల బన్నీ స్టైల్, గెటప్ పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. పుష్ప 2 తరువాత ఆయన పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఇటీవల బన్నీని చూసిన వారు, “ఇంత హ్యాండ్సమ్, యవ్వనంగా ఎలా మారిపోయాడు?” అని ఆశ్చర్యపోతున్నారు.
అయితే బన్నీ ఇలా మారటంతో కొందరు నెటిజన్లు “విదేశాల్లో కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నారా?” అనే ఊహాగానాలు పెంచుతున్నారు. ఇటీవల బన్నీ ఓ ఫోటో వైరల్ అయ్యింది. దాంతో “ఇంటర్నేషనల్ క్లినిక్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారేమో” అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే బన్నీ సన్నిహితులు మాత్రం ఇవన్నీ వదంతులేనని ఖండించారు. “ఆయన విదేశీ టూర్లు పూర్తిగా ఫ్యామిలీ ట్రిప్స్ మాత్రమే. ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకోలేదు. పుష్ప 2 అవతార్ నుంచి పూర్తిగా బయటపడిన తర్వాత మళ్లీ తన స్టైలిష్ లుక్‌ను తిరిగి సొంతం చేసుకున్నారు” అని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమా కోసం బన్నీ లుక్ టెస్టులు జరుగుతున్నాయని సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నాడు. ఈ మూవీపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
Recent Random Post:















