ఆ చేదు అనుభవ‌మే జ‌క్క‌న్న‌ బ్లాక్ బస్టర్ ఫార్ములాగా

జీవితం తీపి చేదు జ్ఞాప‌కాల క‌ల‌బోత అని పెద్ద‌లు అంటారు. లైఫ్ అనేది ఎప్పుడూ తీపి జ్ఞాప‌కాల‌తోనే నిండిపోకూడ‌దు! చేదు జ్ఞాప‌కాల‌తో స‌మ‌తుల్యం అయిన‌ప్పుడే కొన్నిసార్లు ప్ర‌తిభ‌, స‌క్సెస్‌కు సంబంధించిన‌ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. అలాంటి ఒక అనుభ‌వం ఈరోజు రాజ‌మౌళి ఈ స్థాయిలో ఉండటానికి కార‌ణం అంటే న‌మ్మ‌గ‌ల‌రా?

అవును.. ఇది నిజం. అదృష్ట‌వ‌శాత్తూ ఎస్.ఎస్.రాజ‌మౌళి త‌న సినిమాల్లో బ‌ల‌మైన విల‌న్లను చూపించినా కానీ, క్లైమాక్స్ లో హీరోల‌ను చంపేయ‌రు. చివ‌రికి హీరోయిజం గెలుస్తుంది. తాను తీసిన బ్లాక్ బ‌స్ట‌ర్ యాక్ష‌న్ సినిమాల‌న్నిటా చివ‌రిలో ఆడియెన్ ని నిరాశ‌ప‌రిచేలా నెగెటివ్ ఎండింగ్ ఎప్పుడూ చూప‌లేదు. అలాగే క్లైమాక్స్ ఫైట్ విష‌యంలోను ఎప్పుడూ నిరాశ‌ప‌ర‌చ‌లేదు. అయితే ఈ ఫార్ములా వెన‌క అస‌లు కార‌ణం ఇప్పుడు తెలిసింది. Al

ఆయ‌న బాల్యంలో యాక్ష‌న్ సినిమాలంటే చెవి కోసుకునేవాడు. బాల్య ద‌శ‌లో సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `అగ్గి పిడుగు` సినిమాని వీక్షించాడు. త‌న అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్ల‌తో ఉన్న పెద్ద‌ కుటుంబంలో నెల‌కు ఒక సినిమా మాత్ర‌మే చూసే అవ‌కాశం ఉంది. అలా ఒక నెల‌లో అత‌డు `అగ్గి పిడుగు` సినిమాని ఎంచుకున్నాడు. కానీ ఈ సినిమా త‌న‌కు క‌న్నీళ్లు పెట్టించింది. నెగెటివ్ క్లైమాక్స్ మ‌న‌సును క‌లిచి వేసింది. అత‌డిపై దాని ప్ర‌భావం చాలా ఉంది. అది ఎప్ప‌టికీ తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాల్లో ఉండ‌కూడ‌ద‌నే ఫార్ములాగా మారి అది ప్ర‌తిధ్వ‌నిస్తూనే ఉంది.

రాజ‌మౌళి త‌న సినిమాల విష‌యంలో ఒక నియ‌మానికి క‌ట్టుబ‌డి ఉన్నాడు. ఈ నియమం ఆవిర్భావం దర్శకుడిగా త‌న‌ ప్రారంభ రోజులలోనే బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా `స్టూడెంట్ నంబర్ 1` చిత్రంతోనే ఇది క‌నిపించింది. జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. సింహాద్రి-ఛ‌త్రపతి వంటి తదుపరి ప్రాజెక్ట్‌ల్లోను దర్శక‌త్వంలో తానేంటో చూపించారు రాజ‌మౌళి. వీటితో యాక్షన్-ప్యాక్డ్ కథనాలంటే రాజమౌళికి ఉన్న ఆసక్తి అనుబంధం స్పష్టంగా తెర‌పై కనిపించింది. ప్రమోషనల్ ఇంటర్వ్యూల సమయంలో కూడా యాక్షన్ చిత్రాల పట్ల అతడి అభిరుచి స్పష్టంగా తెలియ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ లో కొంత క‌న్ఫ్యూజ‌న్ ఉన్నా, ఇప్పుడు ఎలాంటి సందేహాలు లేవు.

సీనియ‌ర్ ఎన్టీఆర్ `అగ్గిపిడుగు` సినిమాకి సంబంధించిన ఒక ఎపిసోడ్ రాజ‌మౌళిపై తీవ్ర ప్రభావాన్ని చూప‌క‌పోయి ఉంటే? ఈరోజు ఆయ‌న సినిమాల క్లైమాక్స్ ఎలా మారేవో..! భారీ యాక్ష‌న్, కత్తి పోరాటాలను ఆశించిన రాజమౌళి, అగ్గిపిడుగు సినిమా ఊహించిన యాక్షన్ సన్నివేశాలను అందించడంలో విఫలమవడంతో తాను క‌ల‌త‌కు గుర‌య్యాడు. యాక్ష‌న్ సీన్స్ కి బ‌దులుగా కంట‌త‌డి పెట్టించే విషాదకరమైన ముగింపును థియేట‌ర్ లో చూడ‌లేక‌పోయాడు. అది దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ అనుభవం రాజమౌళిలో తన చిత్రాలను ఇలాంటి నిస్సంకోచంగా ట్రాజిక్ ఎండ్ ఉండ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యాడు. తన సినిమాల్లోని హీరోలు ఎప్పుడూ విజయం సాధిస్తారని, ప్రేక్షకులకు సంతృప్తికరమైన ఎగ్జ‌యిట్ చేసే ముగింపుని అందజేస్తాన‌ని ఆయన ప్రతిజ్ఞ చేశారు. విషాదకరమైన క్లైమాక్స్ ని ఎప్పుడూ చూపించ‌కూడ‌ద‌నే నిబద్ధత అతడి మేకింగ్ శైలికి ఒక ముఖ్య లక్షణంగా మారింది. ఇది విక్రమార్కుడు, మగధీర, ఈగ సినిమాల‌ రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది.

కథానాయకుడు కష్టాలను ఎదుర్కొన్న `బాహుబలి`లో కూడా రాజమౌళి ఆశ, విముక్తిని అందించే తీర్మానంతో సమతుల్యతను కాపాడుకున్నాడు. ఈ తత్వం అగ్గిపిడుగు వ‌ల్ల‌నే పుట్టుకొచ్చిన‌ది. తాను అగ్గిపిడుగులో ఏం కోరుకున్నాడో అది త‌న ప్రేక్ష‌కుల‌కు చూపించి స‌క్సెస్ సాధిస్తున్నాడు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత SSMB29 పై దృష్టి సారించారు. ఇందులో మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ఇండియానా జోన్స్ జాన‌ర్ లో అల‌రిస్తుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇందులో కూడా ట్రాజిక్ ఎండ్ ఉండ‌ద‌న్న భ‌రోసా ఉంది.


Recent Random Post:

Pattudala Trailer | Ajith Kumar | Trisha | Arjun | Magizh Thirumeni | Anirudh | Subaskaran | Lyca

January 16, 2025

Pattudala Trailer | Ajith Kumar | Trisha | Arjun | Magizh Thirumeni | Anirudh | Subaskaran | Lyca