
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తాము చేపట్టిన భారీ ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి ఇంకా కనీసం మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. ‘దేవర’ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో ‘వార్ 2’ సినిమా ద్వారా అడుగు పెట్టారు. హృతిక్ రోషన్‌తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.
‘వార్ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ కెజిఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ‘డ్రాగన్’ అనే సినిమా కూడా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఇద్దరిలో పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అంచనాలకు తగ్గట్టుగా సినిమా తెరకెక్కిస్తున్నారట.
‘డ్రాగన్’ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ 30 రోజుల షూటింగ్ పూర్తి చేశారు. ఇందులో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ‘వార్ 2’ ప్రమోషన్స్ తర్వాత ఎన్టీఆర్ ఆగస్ట్ 20 నుండి మళ్లీ ‘డ్రాగన్’ షూటింగ్‌కు వెళ్లనున్నారు. సినిమా పూర్తి చేయడానికి నవంబర్ లేదా డిసెంబర్ వరకు సమయం కేటాయించారు. తరువాత కొరటాల శివతో కలిసి ‘దేవర 2’ని త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సన్నగా, స్టైలిష్‌గా మారారు. ఆయనకు నెవర్ బిఫోర్ లుక్ ఇవ్వబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ కొత్త లుక్‌తో ఎన్టీఆర్ పాత్రను కూడా నెక్ట్స్ లెవల్లో చూపిస్తారని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.
Recent Random Post:















