ఎన్టీఆర్ లక్ష్యం: వార్ 2తో ₹500 కోట్ల క్లబ్ ఎంట్రీ!

Share


ఇండియన్ సినీ ఇండస్ట్రీ స్థాయి రోజురోజుకూ కొత్త శిఖరాలు అధిరోహిస్తోంది. ఒకప్పుడు ₹100 కోట్లు సాధిస్తేనే పెద్ద విజయం అనుకుంటే, ఇప్పుడు సినిమాలు ₹2000 కోట్ల క్లబ్‌ను టార్గెట్ చేస్తున్నాయంటే మన పరిశ్రమ ఎంత వేగంగా ఎదుగుతోందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే హీరోలు తమ సినిమాలతో కొత్త బెంచ్‌మార్కులు క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ ₹500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

అయితే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ ఆ క్లబ్‌ను చేరనిది. ఆయన చివరి చిత్రం దేవర పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద ₹400 కోట్లకుపైగా వసూళ్లు సాధించినా, 500 కోట్లు టచ్ చేయలేకపోయింది.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2తో ఆ కల నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ లీడ్ రోల్‌లో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం వార్ (2019)కి సీక్వెల్. ఇందులో తారక్ ఓ పవర్‌ఫుల్ నెగిటివ్ షేడ్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజు రజినీకాంత్ కూలీ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో దక్షిణాది మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. కానీ ఉత్తరాదిలో వార్ 2కే భారీ డోమినెన్స్ ఉండబోతోందని అంచనాలు. ఎన్టీఆర్ పాన్-ఇండియా ఇమేజ్ వల్ల సౌత్‌లోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి ఈసారి వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ ఖచ్చితంగా ₹500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి!


Recent Random Post: