ఎన్టీఆర్-హృతిక్ వార్ 2 ప్రీరిలీజ్ రచ్చ

Share


ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు వెర్షన్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని నాగవంశీ హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ వేడుకను భవ్యంగా నిర్వహించారు.

వేదికపై ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్‌కు చేరడంతో అభిమానుల హడావిడి అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టమైంది. వేలాదిగా అభిమానులు తరలి వచ్చి స్టేడియంను నిండగోపేలా చేశారు. ఈవెంట్ సెక్యూరిటీ కోసం దాదాపు 1200 మంది పోలీసుల బలగాన్ని వినియోగించారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ – “ప్రభుత్వ సహకారం, పోలీసుల అండ వల్లే ఈ వేడుక ఇంత గ్రాండ్‌గా జరిగింది” అన్నారు.

వేదికపై హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. “ఎన్టీఆర్ మీకు అన్నయ్య అయితే, నాకు తమ్ముడు” అని అభిమానులను ఉత్సాహపరిచారు. “నేను రియల్ టైగర్‌తో కలిసి నటించాను… అతను నిజంగా సాధించాడు!” అంటూ తన అనుభూతిని పంచుకున్నారు.

అయితే, ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు అభిమానుల కేరింతలు, హడావిడి ఆగకపోవడంతో ఆయన ఒక దశలో సీరియస్ అయ్యారు. “ఒక్క సెకండ్‌లో మైక్ ఇచ్చి వెళ్లిపోతాను” అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత స్పీచ్ కొనసాగిస్తూ, “ఈ రోజు నేను ఇంత ధైర్యంగా మీ ముందుకు వచ్చానంటే, దానికి కారణం నా అభిమానులే. నా 25 ఏళ్ల కెరీర్‌కు మీ ఆశీస్సులే బలమైన ఆధారం” అని అన్నారు.


Recent Random Post: