
ప్రముఖ నటి కరీనా కపూర్ గతంలో పలువురు హీరోలతో డేటింగ్ చేసిందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆమె షాహిద్ కపూర్‌తో సుదీర్ఘ కాలం రిలేషన్లో ఉండగా, పెళ్లికి దగ్గర్లో బ్రేకప్ కావడం అందరికీ తెలిసిందే. అనంతరం, తనకంటే వయస్సులో పెద్దవాడైన సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
అయితే, తాజాగా కరీనా తన డేటింగ్ లిస్ట్‌లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు ఉండేదని చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పాపులర్ టీవీ షో ‘రెండెజౌస్ విత్ సిమి గ్రేవాల్’ త్రోబ్యాక్ ఎపిసోడ్లో, “ఒకవేళ అవకాశముంటే ఎవరితోనైనా డేటింగ్‌కి వెళ్తారా?” అనే ప్రశ్నకు స్పందిస్తూ, “ఇది కొంచెం వివాదాస్పదంగా అనిపించొచ్చు, కానీ నేను రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలనుకున్నాను!” అని చెప్పింది.
ఆ సమయంలో రాహుల్ గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనిపించేదని, తాను సినిమా కుటుంబం నుంచి వచ్చానని, అతను రాజకీయ కుటుంబం నుంచి వచ్చినందున మా మధ్య ఓ ఆసక్తికరమైన అనుబంధం ఉండొచ్చని భావించానని పేర్కొంది. అయితే, ఈ వ్యాఖ్యలపై అనంతరం మరో ఇంటర్వ్యూలో స్పందించిన కరీనా, “అప్పుడు మా ఇంటిపేర్లు బాగా ప్రచారంలో ఉండటంతో సరదాగా అలా చెప్పాను!” అని క్లారిఫై చేసింది.
కరీనా 2012లో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట 2016లో తమ మొదటి కుమారుడు తైమూర్‌ను, 2021లో జెహ్ను స్వాగతించారు. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్లో బిజీగా కొనసాగుతున్నారు.
Recent Random Post:















