మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఆయనది ఏ సినిమా వచ్చినా థియేటర్ల వద్దకు వెళ్లి క్యూలు కడుతున్నారు. ఫ్యాన్స్ జోరు చూసిన చిరంజీవి కూడా అందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏటా రెండేసి చిత్రాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
విరామం లేకుండా తెగ కష్ట పడిపోతున్నారు. తనకు కథ వచ్చే వరకు వేచి చూసి మరీ సినిమాలు చేస్తున్నారు. ఆయన చేసే ప్రతీ సినిమా హిట్టయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ గా నిలిచినప్పటి నుంచి కాస్త నెమ్మదించారు. కానీ వాల్తేరు వీరయ్య హిట్టుగా నిలవడంతో మళ్లీ ఊపందుకున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన మరో రెండు నెలల్లో ఫ్రీ అయిపోతారు.
ఆ తర్వాత బింబిసార ఫేం డైరెక్టర్ వశిష్ట జవాన్ ఫేమ్ బీవీఎస్ రవి దర్శకులుగా మైత్రీ మూవీ మేకర్స్ యువీ క్రియేషన్స్ కోసం మెగాస్టార్ సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి చిరు తనకు సెట్ అయ్యే.. హిట్టుగా నిలిచే ప్రాజెక్టు కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిదెల… తన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇటీవలే ఓ రెండు సినిమాలు నిర్మించింది.
ఒకటి వెబ్ సిరీస్ కాగా మరో సినిమా. అయితే ఈ రెండు డిజాస్టర్లుగా నిలిచాయి. వీటి వల్ల సుస్మిత చాలానే లాస్ అయినట్లు తెలుస్తోంది. అయితే కూతురుకు లాభాల వర్షం కురిపించాలని చిరు గట్టిగా అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే చిరంజీవి తన కూతురి సినిమా కోసం ముగ్గురు దర్శకులతో కలవబోతున్నట్లు సమాచారం. అయితే వెంకీ కుడుముల ఇప్పటికే చిరుతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. చిరుకి కథ నచ్చకపోవడంతో దాన్ని డెవలప్ చేసే పనిలో పడ్డారు.
అలాగే తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ కూడా ఇటీవల మెగాస్టార్‌కి ఒక ‘పాయింట్’ వివరించాడు. దానిని సరైన కథగా డెవలప్ చేస్తే అది హిట్టుగా నిలుస్తుందట. ఇదే కాకుండా సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల చిరుకు ఓ కథ చెప్పాడట.
దాన్ని మరింత అభివృద్ధి చేస్తే సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తుందని భావిస్తున్నారట. అయితే ఈ కథలన్నీ చిరు కోసం రాస్తుండగా.. ఆయన కూతురు నిర్మాణంలోనే ఓ సాలిడ్ సినిమా తెరపైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. మరి చూడాలి ఏది తెరకెక్కనుందో.
Recent Random Post: