
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా అభిమానులు, అన్ని భాషల ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ సృష్టిస్తోంది. రజనీకాంత్ క్రేజ్ తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్ గత విజయాలతో కూడిన ట్రాక్ రికార్డు కారణంగా కూడా ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయ్యింది. తమిళనాడు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలు, ఉత్తర భారతదేశం లోనూ ‘కూలీ’కు ప్రీ-సేల్ టికెట్ల రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో గంటకు 50 వేల నుంచి 60 వేల టికెట్లు బుక్ అయ్యే సందడి సాగింది.
సోషల్ మీడియాలో ఈ టికెట్ బుకింగ్ స్క్రీన్‌షాట్లు వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ సినిమాలన్నింటికంటే ఎక్కువ క్రేజ్‌తో ‘కూలీ’కి ఈ స్థాయి బజ్ క్రియేట్ కావడం పెద్ద విషయమని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 2025లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ‘కూలీ’ ప్రీ-సేల్ లో టాప్ లో నిలిచింది.
అంతేకాదు, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా వసూళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. విడుదలికి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండగా, ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయల ప్రీ-సేల్ వచ్చేసింది. ఇది మరింత పెరిగి 50 నుండి 70 కోట్ల దాకా చేరే అవకాశం ఉంది. విడుదలైన మొదటి రోజు రూ.100 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరడం కొద్ది సినిమాలు మాత్రమే సాధించగలవు. కానీ ‘కూలీ’ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లోనే మొదటి రోజే 100 కోట్ల వసూళ్ల రికార్డు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్, రజనీకాంత్ క్రేజ్ కలసి ‘కూలీ’ బాక్సాఫీస్‌లో భారీ హిట్ కావడం ఖాయం అని అంచనా. ఈ సినిమాలో బాగా ఊహించని రికార్డులు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Recent Random Post:















