
జాన్వీ కపూర్‌ను తొలుత కోలీవుడ్‌లో లాంచ్ చేయాలనే బోనీ కపూర్ ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. పలువురు కోలీవుడ్ హీరోలు, దర్శకులతో సంప్రదింపులు జరిపినా, ఎందుకనో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అప్పటికే టాలీవుడ్ పాన్-ఇండియా మార్కెట్లో దూసుకుపోతుండటంతో, కోలీవుడ్ కంటే టాలీవుడ్ మేలనుకున్నారా ఏమో కానీ, చివరికి జాన్వీ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇదే తరహాలో ఇప్పుడు బోనీ కపూర్ తన చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ను కోలీవుడ్‌లో లాంచ్ చేయాలని చూస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖుషీ హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది, ఇది ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అయితే, ఆ ప్రాజెక్ట్‌కు సంబంధం లేకుండా బోనీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని సమాచారం.
మణిరత్నం సినిమాతో లాంచ్?
తాజాగా బోనీ కపూర్ లెజెండరీ దర్శకుడు మణిరత్నాన్ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ భేటీలో తన చిన్న కుమార్తె లాంచ్ గురించి చర్చించినట్లు సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో డెబ్యూ అయితే ఖుషీకి గొప్ప స్టార్ట్ అవుతుందని బోనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మణిరత్నం ఇప్పటికే కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు కలిగిన దర్శకుడు. ఎన్నో అందమైన ప్రేమకథలను తెరకెక్కించిన ఆయన, శ్రీదేవి చిన్న కుమార్తెను లాంచ్ చేయడాన్ని మానసికంగా అంగీకరించారని టాక్.
ప్రస్తుతం మణిరత్నం ‘Thug Life’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక, తన మార్క్ అందమైన ప్రేమకథను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో కొత్త నటీనటులు నటించనున్నారని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆ గోల్డెన్ ఛాన్స్ ఖుషీ కపూర్‌దే అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
జాన్వీ కపూర్‌ను టాలీవుడ్లో లాంచ్ చేసి, ఖుషీ కపూర్‌ను కోలీవుడ్‌లో పరిచయం చేస్తూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు కూతుళ్ల కెరీర్‌ను బలాన్నిస్తున్న బోనీ కపూర్ – ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి! 🚀🎬
Recent Random Post:















