
మెగాస్టార్ చిరంజీవి వయసు 70కు దగ్గరపడుతున్న వేళ, ఆయనను ఎలా చూపించాలనే విషయంలో కొందరు దర్శకులు తడబడుతున్నారు. “భోళా శంకర్”, “ఆచార్య” లాంటి డిజాస్టర్లు, “గాడ్ ఫాదర్” లాంటి యావరేజ్ సినిమాలు అందుకు ఉదాహరణ. చిరంజీవి యాక్షన్, డాన్స్ వంటి అంశాలకే పరిమితం కాకుండా, రజనీకాంత్ “జైలర్” లా పర్ఫెక్ట్ హీరోయిజంతో చూపించాలనే డిమాండ్ మెగా ఫ్యాన్స్ నుంచి వస్తోంది. “వాల్తేరు వీరయ్య” హిట్ అయినా, మెగా స్థాయికి సరిపోలేదనే అభిప్రాయం ఉంది.
ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా నిర్మించబోతున్న నాని మాత్రం ఈ విషయంపై చాలా క్లారిటీతో ఉన్నాడు. ఒక ఇంగ్లీష్ వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో చిరు చేసే సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటివరకు చిరంజీవిని “లార్జర్ దాన్ లైఫ్” హీరోగా చూపించామని, కానీ ఆయనతో ప్రేక్షకులు వ్యక్తిగతంగా కనెక్ట్ కావడానికే అసలు ఆయన స్టార్ అయ్యారని నాని చెప్పాడు. “శ్రీకాంత్ ఓదెల ఈ రిలేటబిలిటీని మరింతగా తెరపై చూపిస్తాడు” అని నాని వెల్లడించాడు. అంటే నేచురల్ హీరోయిజంతో పాటు, మెగా మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా సినిమాను డిజైన్ చేస్తున్నారన్నమాట.
సినిమా ఎప్పుడోస్తుంది?
ఇక ఈ మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ముందుగా “విశ్వంభర” పూర్తవ్వాలి. ఆ తర్వాత “మెగా 157” ఉంటుంది. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యేలోగా బాబీ డైరెక్షన్‌లో చిరు మరో మూవీ చేసే అవకాశం ఉందని టాక్. మరోవైపు, “ది ప్యారడైజ్” సినిమాతో బిజీగా ఉన్న శ్రీకాంత్ ఓదెల దీనికోసం ఒక ఏడాది సమయం కేటాయించనున్నాడు.
ఈ లెక్కన చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల మూవీ 2026 మధ్యలో కానీ ప్రారంభం కాకపోవచ్చు. కానీ, నాని నిర్మాతగా చిరంజీవి హీరోగా వస్తున్న ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి!
Recent Random Post:















