చిరంజీవి 158: బెంగాల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్

Share


మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న 158వ చిత్రం ఇప్పటికే అధికారికంగా లాక్ అయింది. ప్రీ–ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. చిరంజీవి 157వ చిత్రం పూర్తయ్యగానే వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు బాబి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తుండటం తెలిసింది. దాదాపుగా నటీనటుల ఎంపిక కూడా పూర్తయ్యే దశలోనే ఉన్నా, ప్రస్తుతం మాత్రం హీరోయిన్ సెలక్షన్‌లో స్వల్ప జాప్యం ఎదురవుతోంది. చిరంజీవి ఇమేజ్, వయసుకు తగ్గ పరిపూర్ణ నాయిక కోసం టీమ్ ఇంకా వెతుకుతోంది. మరికొన్ని రోజుల్లో హీరోయిన్ పేరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక కథ ఏ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందన్న ఆసక్తికర చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం—ఈ సినిమా బెంగాల్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్గా సాగనుందట. ఈ బ్యాక్‌డ్రాప్‌ను బాబి–చిరంజీవి ఇద్దరూ బాగా కనెక్ట్ అయ్యే విధంగా డెవలప్ చేశారని తెలుస్తోంది.\

బాబి తొలి చిత్రం పవర్లో కూడా బెంగాల్‌లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా చిరంజీవి—గుణశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన చూడాలని ఉంది పశ్చిమ బెంగాల్ నేపథ్యంతో సాగిన క్లాసిక్ హిట్. ఆ చిత్రంలో చిరంజీవి పాత్రదర్శనం ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

ఇదిలా ఉంటే, చిరు చాలా ఏళ్ల తర్వాత బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌ను టచ్ చేసిన సినిమా భోళా శంకర్. కానీ అది భారీ నిరాశగా మిగిలింది. అయితే, ఇప్పుడు బాబి సరికొత్త కథతో, కొత్త ట్రీట్‌మెంట్‌తో చిరంజీవిని అదే బ్యాక్‌డ్రాప్‌లో మళ్లీ ప్రెజెంట్ చేయబోతున్నాడని టాక్.

ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మాస్ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. చిరంజీవి 158వ చిత్రం మాస్ అండ్ ఎమోషన్స్ మిక్స్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.


Recent Random Post: