
సౌత్‌లో స్టార్హీరోయిన్లలో అగ్రశ్రేణిలో ఉంటూ ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో మెరిసిన నయనతార… ఇటీవల కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోవడంతో ఆమె క్రేజ్ కొద్దిగా తగ్గిందనే మాట వినిపిస్తోంది. వయసు కూడా 40 దాటిన నేపథ్యంలో కామర్షియల్ సినిమాలకు కాస్త దూరంగా ఉండిపోయింది నయన్. అయితే ఇప్పుడు మళ్లీ తన స్టైల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా157 సినిమాలో హీరోయిన్గా నటించనుండగా… ఈ సినిమా కోసం నయనతారను సెలెక్ట్ చేశారనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కలిపిన ఓ భారీ స్క్రిప్ట్ సిద్ధం చేసిన అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార చాలా కాలం తర్వాత చేస్తున్న తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.
సొంతంగా రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన నయన్, మేకర్స్ వెనకడుగు వేసిన తర్వాత… చివరికి రూ.6 కోట్లకే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇది ఆమె రీసెంట్ ప్రాజెక్ట్స్ లో అత్యల్ప పారితోషికం కావడం గమనార్హం. కానీ remuneration తగ్గించినా, ప్రమోషన్ల విషయంలో మాత్రం నయన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చిందట. కెరీర్లో ఎప్పుడూ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతార, ఈ సినిమాకు మాత్రం ప్రత్యేకంగా ప్రమోషన్స్‌లో పాల్గొననుందని అనిల్ రావిపూడి తెలిపాడు.
అంతేగాక, ఆమెను హీరోయిన్గా ప్రకటించే వీడియోను కూడా రిలీజ్ చేసి ప్రమోషన్‌కు మాంచి కిక్ ఇచ్చాడు అనిల్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సాహు గారపాటి, చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌ను భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, షూటింగ్ త్వరలో మొదలుకానుంది.
మెగా157పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మెగాస్టార్, లేడీ సూపర్‌స్టార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ ఖచ్చితంగా 2025లోని పెద్ద హిట్లలో ఒకటిగా నిలవనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Recent Random Post:















