ఛావా సినిమాలో ఏసుబాయి పాత్ర రష్మికను భావోద్వేగానికి గురిచేసిందా?

Share


నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పటివరకు అనేక విభిన్న పాత్రల్లో నటించి, ప్రేక్షకులను అలరించింది. ప్రేమికురాలిగా, స్పోర్ట్స్ ఉమెన్‌గా, భార్యగా—ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా ‘పుష్ప’ లో శ్రీవల్లి పాత్ర ద్వారా మరింత ప్రజాదరణ పొందింది. కన్నడ చిత్రాలతో సహా పలు భిన్నమైన కథాంశాల్లో తన నటనను ప్రదర్శించిన రష్మిక, ఇప్పుడు ‘ఛావా’ చిత్రంతో భావోద్వేగపూరిత పాత్రను పోషించింది.

‘ఛావా’ చత్రపతి శివాజీ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, రష్మికకు ఎంతో ప్రత్యేకమైంది. ఇందులో ఆమె శంభాజీ భార్య ఏసుబాయి పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఆ పాత్రలో ఆమె లుక్, భిన్నమైన మేకోవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర రష్మికను ఎంతగా ప్రభావితం చేసిందో ఆమె మాటల నుంచే అర్థమవుతోంది.

ఇటీవల ముంబైలో జరిగిన ‘ఛావా’ ఈవెంట్‌కు రష్మిక కాలికి గాయమైనా హాజరైంది. సినిమా పూర్తయిన తర్వాత ప్రతిసారి చూసినప్పుడు ఆమె ఎంతో ఎమోషనల్ అయిందట. ప్రతిసారి కన్నీళ్లు ఆపుకోలేకపోయిందని, అసలు ఎందుకు ఇలా జరుగుతోందో తనకే అర్థం కావడం లేదని చెప్పింది. అంతేకాదు, ఈ సినిమాతోనే తాను రిటైర్మెంట్ ప్రకటించినా ఆనందంగా ఉంటుంది అని ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది.

ఏసుబాయి పాత్రను జీవించడం ఆమెకు ఎంతటి అనుభూతినిచ్చిందో ఈ ప్రకటనల ద్వారా స్పష్టమవుతోంది. ఈ పాత్ర నుంచి బయటకు రావడం కూడా తనకు కష్టంగా మారిందని రష్మిక వెల్లడించింది. సినిమా విడుదలై పెద్ద హిట్ అయితే, ఆమె సంతోషానికి హద్దులు ఉండవు. బాలీవుడ్‌లో ‘ఛావా’ రష్మిక కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకంతో ఉంది.


Recent Random Post: