
ఇండియా–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపధ్యంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. రెండు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ అణుబాంబు ముప్పు చూపిస్తూ ఆగడాలు ప్రదర్శిస్తోంది. “చింత చచ్చినా పులి చావదు” అన్నట్టు, హెచ్చరికలతో తమ మానసిక దౌర్భాగ్యాన్ని ఆవిష్కరిస్తోంది.
ఈ పరిస్థితుల్లో, ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అణుబాంబు నేపథ్యంతో ఓ సినిమా రూపొందించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ చిత్రం, రచయిత చార్లెస్ పెలెగ్రినో రచించిన ‘Ghosts of Hiroshima’ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని రూపొందనుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో అణుదాడి నుండి ప్రాణాలతో బయటపడిన జపాన్‌కు చెందిన ఒక బాధితుడి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనుంది.
ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్ర పనుల్లో నిమగ్నంగా ఉన్నారు. తర్వాత ‘అవతార్ 4’ ప్రారంభం కానుంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన అనంతరం, అణుబాంబు నేపథ్య కథను తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే కామెరూన్ సినిమాల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి చిత్రం పట్ల ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి, అత్యున్నత స్థాయిలో తయారు చేస్తారు. అందువల్ల ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో టెక్నికల్ అద్భుతాలు మాత్రమే కాక, మానవీయ భావోద్వేగాలు, హిరోషిమా-నాగాసాకీల పీడాకర చరిత్రను కూడా తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. అణుదాడి అనంతరం ఆ ప్రాంతాల్లో గడ్డి కూడా మొలకెత్తలేని పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అలాంటి భయంకరమైన చరిత్రను ప్రపంచానికి మరోసారి గుర్తు చేసే ప్రయత్నం ఇది.
Recent Random Post:















