టాటూలకు గుడ్‌బై చెప్పిన సమంత

Share


సమంతకు టాటూలంటే ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఒక సమయంలో ఆమె తన శరీరంపై అనేక టాటూలు వేయించుకుంది. ముఖ్యంగా నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పటికీ, వివాహానంతరం మూడు ప్రత్యేకమైన టాటూలను తన శరీరంపై ఆ గుర్తులుగా వేసుకుంది.

అయితే ఇప్పుడు గతం మరిచిపోయే క్రమంలో, ఆ గుర్తులను కూడా తుడిచేయాలని భావిస్తోంది సమంత. ఇప్పటికే తన పక్కటెముకలపై ఉన్న చైతన్య పేరును తొలగించేసిందట. తాజాగా తన కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన తొలి చిత్రం యెమాయచేసావే గుర్తుగా వేసుకున్న “యెంసీ” టాటూలను కూడా తీసేసిందని సమాచారం.

ఇలా రెండు టాటూలకు గుడ్‌బై చెప్పిన సమంత, తన జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోందని ఫిలింనగర్ టాక్. త్వరలో ఆమె రెండో వివాహం చేసుకోనుందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే పాత గుర్తులన్నింటినీ చెరిపేసే దిశగా అడుగులు వేస్తుందన్న అభిప్రాయం పలుకుతోంది.


Recent Random Post: