తల అజిత్ కొత్త స్ట్రాటజీతో AK64కి గ్రీన్ సిగ్నల్

Share


ఇటీవ‌ల త‌ల అజిత్‌ పూర్తిగా కార్ రేసింగ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్యాషన్ కోసం నెలల తరబడి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ, రేసింగ్ ట్రాక్‌లో రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన రేసింగ్‌లో విజేతల జాబితాలో కూడా నిలుస్తున్నారు. అయితే రేసింగ్‌లో బిజీగా ఉన్నంత మాత్రాన సినిమాలను వదిలేశారని అనుకోవాల్సిన అవసరం లేదు. రెండు రంగాల్లోనూ సమానంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు ఫ్లాప్స్ వచ్చినా, ఒక్క పెద్ద హిట్‌తో మళ్లీ ఘనంగా కంబ్యాక్ అవుతున్నారు.

అజిత్ నటించిన విదాముయార్చి బాక్సాఫీస్ వద్ద విఫలమైనా, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” సూపర్ హిట్ అయ్యి, అజిత్ కెరీర్‌కి మళ్లీ బలాన్ని ఇచ్చింది. ఇందులో త్రిష కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత అజిత్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారనే ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం, ఆయన AK64 (ఏకే 47) అనే కొత్త సినిమాకి సిద్ధమవుతున్నారు.

తాజా వార్తల ప్రకారం, ఈ సినిమాకి అజిత్ ఎటువంటి పారితోషికం తీసుకోరని, దానికి బదులుగా సినిమా యొక్క ఓటీటీ మరియు డిజిటల్ హక్కుల మొత్తాన్ని పొందనున్నారని సమాచారం. నిర్మాతలు థియేట్రికల్ రైట్స్ ద్వారా తమ పెట్టుబడిని తిరిగి పొందుతారు. ఈ కొత్త మోడల్ ద్వారా అజిత్ పని చేయడానికి కారణం ఏమిటంటే – ఆయన భారీ రెమ్యూనరేషన్ (200 కోట్ల రూపాయలు) డిమాండ్ చేయడంతో కొంతమంది నిర్మాతలు వెనక్కి తగ్గారని టాక్.

“గుడ్ బ్యాడ్ అగ్లీ” దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఈ AK64కి కూడా దర్శకత్వం వహించనున్నారు. మొదట ఈ సినిమాను వెల్స్ ఫిల్మ్స్ నిర్మించాలనుకున్నా, ఇప్పుడు రోమియో పిక్చర్స్ రాహుల్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనుందని, నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించనుండగా, సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ సమకూర్చనున్నారు. ఈసారి అజిత్ కొత్త రీతిలో రీమ్యునరేషన్‌ లేకుండా ఒప్పందం చేసుకోవడం, ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.


Recent Random Post: