‘యానిమల్’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యారు. రణబీర్ కపూర్‌తో చేసిన రొమాంటిక్ సీన్స్, ముఖ్యంగా త్రిప్తి పోషించిన ‘జోయ్’ పాత్ర ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. రష్మిక మందన్న కథానాయికగా ఉన్నా, త్రిప్తికి వచ్చిన క్రేజ్ మాత్రం అంతకంటే ఎక్కువే.
అయితే ఈ క్రేజ్ వల్లే ఆమెను వెనక్కి లాగేందుకు ఓ స్టార్ హీరోయిన్‌కు చెందిన పీఆర్ టీం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్రిప్తిని డీగ్రేడ్ చేయడానికి ఆ టీం ప్రయత్నిస్తోందని, ఆమె సినిమాలకు బ్రేక్ వేయడానికి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌ను ప్రభావితం చేస్తున్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా త్రిప్తి ఇప్పటికే కొన్ని మంచి ఆఫర్లు కోల్పోయిందని టాక్.
ఇటీవల త్రిప్తి డిమ్రి, షాహిద్ కపూర్ హీరోగా విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యారు. మొదట ‘సింగిల్ కార్డ్ హీరోయిన్’గా ప్రకటించినప్పటికీ, ఇప్పుడు ఆ పాత్రలో మార్పులు చోటుచేసుకున్నాయంటూ బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు దిశా పటానీని తీసుకోవడంతో త్రిప్తి పాత్ర ప్రాధాన్యం తగ్గినట్లు తెలుస్తోంది. మొదట రెండు పాటల కోసమే దిశా అని చెప్పినప్పటికీ, ఇప్పుడు ఆమె పాత్ర మరింత విస్తృతమవుతుందనే మాట వినిపిస్తోంది.
యానిమల్ తర్వాత త్రిప్తికి పెద్ద హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న ఆమెకి ఇది షాక్ అని చెప్పాలి. ఇదే సమయంలో ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందే ‘స్పిరిట్’ చిత్రంలో త్రిప్తిని కథానాయికగా ఎంపిక చేశారు. షాహిద్ కపూర్ మూవీ హిట్ అయి, స్పిరిట్ కూడా సక్సెస్ అయితే త్రిప్తి ఓ టాప్ హీరోయిన్‌గా వెలుగొందే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, షాహిద్ మూవీ క్రెడిట్ ఆమెకే వస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది.
Recent Random Post: