తాజాగా తల్లి అయిన దీపికా పదుకోన్ తిరిగి సినీ రంగంలో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా నటించే “స్పిరిట్” చిత్రానికి ఓకే చెప్పింది. కానీ పారితోషికం భారీగా అడగడం, పని గంటలు రోజుకు 6-7గంటలకే పరిమితం చేయాలన్న డిమాండ్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి నచ్చలేదు. దీంతో ఆయన దీపికను ప్రాజెక్ట్ నుంచి తప్పించి, త్రిప్తి దిమ్రీను హీరోయిన్‌గా ఎంపిక చేశాడు.
ఈ నేపథ్యంలో ఎడితేటా లీకుల వర్షం. సందీప్ వంగా వైపు నుంచి దీపిక డిమాండ్లు లీక్ చేయడం, మరోవైపు దీపిక టీం నుంచి “స్పిరిట్”లో హాట్ సీన్లు ఉన్నాయని మీడియాలో హింట్లు రావడం వల్ల విషయానికి మంట పెట్టింది. మరింత ఊపందుకుంటూ, సందీప్ వంగా సోషల్ మీడియాలో దీపికపై ప్రత్యక్షంగా స్పందించడంతో వివాదం మరో మెట్టు ఎక్కింది.
అయితే ఈ పరిణామాలపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకవైపు దీపికకు మద్దతుగా, మరోవైపు సందీప్‌కు మద్దతుగా ట్వీట్లు వెల్లువెత్తాయి. దీపిక మాత్రం తాను స్టార్ అని, తన స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
ఇలాంటి సమయంలోనే ఆమెకు మరో బిగ్ బ్రేక్ వచ్చి చేరింది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందే భారీ పాన్ ఇండియా చిత్రానికి ఆమె ప్రధాన కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఈరోజే అధికారికంగా ప్రకటించింది. దీపిక ప్రస్తుత లుక్‌ను ఒక వీడియో రూపంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది.
ఇది చూస్తుంటే, ఒక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా మరో భారీ ప్రాజెక్ట్‌లో స్థానం దక్కించుకోవడం – దీపిక స్టార్డం ఎంతగా నిలదొక్కుకుందో చాటింది. “స్పిరిట్” కోల్పోయినా… మరింత స్పెషల్ ప్రాజెక్ట్ గెలుచుకున్నదీ దీపికే!
Recent Random Post: