దీపికా డిమాండ్స్‌పై కబీర్ ఖాన్ స్పందన

Share


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా రోజుకు 8 గంటలకంటే ఎక్కువ వర్క్ చేయనని చెప్పడమే కాక, రూ. 25 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

ఈ వార్తలపై తాజాగా ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ స్పందించారు. చందూ ఛాంపియన్, భజరంగీ భాయీజాన్ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన కబీర్ ఖాన్, దీపికా డిమాండ్స్ ను సమర్థిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సినీ ఇండస్ట్రీలో పనిచేసేవారికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారి ఆరోగ్యం కూడా కీలకం. వారికి పర్సనల్ టైమ్ అవసరం. ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా రోజుకు 8 గంటలే వర్క్ చేస్తారు. అయితే అదే విషయాన్ని దీపికా కోరితే తప్పు ఎలా అవుతుంది?” అని ప్రశ్నించారు.

ఒక నటుడిని ప్రాజెక్ట్ నుండి తప్పించే ముందు దర్శకులకు సరైన కారణం ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. “మూవీ షూటింగ్స్ కోసం నటులు తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలనే తత్వంతో నేను ఏకీభవించను. నేను ఇప్పటివరకు నా కెరీర్లో 12 గంటలకు మించి షూటింగ్ చేయలేదు. ఆదివారాల్లో పనికి వెళ్లిన సందర్భాలు కూడా లేవు” అని అన్నారు.

దీపికా పారితోషికం విషయంలో కూడా స్పందించిన కబీర్ ఖాన్, “ఎవరైనా తమ క్రేజ్ ను బట్టి రెమ్యునరేషన్ అడిగే హక్కు ఉంది. వారికి ఉన్న స్టార్‌డమ్ ను బట్టి పారితోషికం ఇవ్వాలి” అన్నారు. ప్రస్తుతం కబీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారాయి.


Recent Random Post: