
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభాస్ కూడా సెట్స్‌లోకి రావడానికి రెడీ అవుతున్నారు.
అయితే ఇటీవలే హీరోయిన్ విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటగా అనుకున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రాజెక్ట్ నుంచి తప్పించబడారు. ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీను ఫైనల్ చేశారు. త్రిప్తి యానిమల్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యం తెలిసిందే. ఈ మార్పుతో దీపికను ఎందుకు తప్పించారన్న చర్చ నెట్టింట హీట్ పెంచింది.
ఈ సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ మరింత చర్చనీయాంశంగా మారింది. “డర్టీ పీఆర్ గేమ్స్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఒక స్టార్ హీరోయిన్ పీఆర్ టీమ్ తన సినిమా స్టోరీని లీక్ చేయబోతుందని, ఇది సరికాదని ఆయన అన్నారు. “నేను కథను రాయడానికి ఏళ్ల తరబడి కష్టపడతా. నా ప్రపంచం సినిమానే. ఒకసారి నమ్మకంతో కథను చెప్పిన తర్వాత, అది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లాంటి విషయమే. కానీ ఇప్పుడు లీక్ చేయాలని చూస్తున్నారు. ఒక యువ హీరోయిన్ ఎదగకుండా చూడడం, నా కథను బయటపెట్టడం ఇదేనా ఫెమినిజం?” అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ వ్యాఖ్యలు దీపికాను ఉద్దేశించి చేసినవేనని నెటిజన్లు భావిస్తున్నారు. దీపికను ప్రాజెక్ట్ నుంచి తప్పించాక బాలీవుడ్ మీడియాలో స్పిరిట్ పై తప్పుడు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇకపోతే, దీపికను తప్పించడానికి వన్ సైడ్ స్టోరీలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఉదాహరణకి, ఆమె రోజుకి 6 గంటలే వర్క్ చేస్తానని, షూటింగ్ 100 రోజులు మించితే అదనంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని చర్చ ఉంది. పైగా పలు కండీషన్లు పెట్టినట్టు కూడా టాక్ వినిపిస్తోంది.
ఇవన్నీ కలిపి సృజనాత్మక విభేదాలు తలెత్తాయని, దాంతో వంగా ఆమెను తప్పించాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయం నెట్టింట జోరుగా వినిపిస్తోంది. కొన్ని నెలల క్రితం తల్లి అయిన దీపిక తన ప్రొఫెషనల్ బాధ్యతలపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో డైరెక్టర్‌తో నేరుగా చర్చించకుండా షరతులు విధించడం పట్ల నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ సినిమా నుంచి తప్పించినా, కథను లీక్ చేయడం నైతికంగా సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి దీపిక–వంగా మధ్య జరిగిన ఈ వివాదం ప్రస్తుతం బాలీవుడ్–టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Recent Random Post:















