
సౌత్ సినిమాల్లో మమ్ముట్టి కొడుకుగానే కాదు, తన సొంత క్రేజ్‌తో ప్రత్యేక స్థానం దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంలో స్టార్‌గా రూల్ చేస్తూ, తెలుగులో వరుస సినిమాల ద్వారా అభిమానులను సంపాదిస్తున్నాడు. మహానటిలో జెమిని గణేషన్ పాత్రతో మెప్పించిన దుల్కర్, సీతారామంతో సెన్సేషనల్ హిట్ సాధించాడు. ఇటీవల వచ్చిన లక్కీ భాస్కర్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే కాంత మాత్రం కమర్షియల్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పటికే ఆకాశంలో ఒక తార చేస్తూ బిజీగా ఉన్న దుల్కర్, నూతన దర్శకుడు రవితో మరో సినిమాను కూడా లాక్ చేశాడు. ఇవి కాకుండా, ఒక క్రేజీ బయోపిక్‌లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అది మరెవరి కథ కాదు — ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్.
మూడుసార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్ పాత్రలో దుల్కర్ కనిపించబోతున్నాడట. అయితే పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నా, దుల్కర్‌ను ఎందుకు ఫైనల్ చేశారు? దీనికి ఒక సింపుల్ రీజన్ ఉందట — దుల్కర్ సినిమాలకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసే అతడి ఇమేజ్ ఈ ప్రాజెక్ట్‌కి హెల్ప్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.
ఇంకా, దుల్కర్ వరుస సక్సెస్‌లతో మంచి ఫామ్‌లో ఉండటం కూడా కీలక కారణాలలో ఒకటి. అతడి మార్కెట్ తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు హిందీ ఆడియన్స్‌కి కూడా ఉంది. అందుకే విశ్వనాథన్ ఆనంద్ కథకు అతడే సరైన ఎంపికగా భావించారు.
దుల్కర్ ఏ పాత్రను చేసినా దానిలో పూర్తిగా లీనమైపోయే నటుడు. కాంత సినిమా పర్ఫార్మెన్స్ విషయంలో కూడా అతడు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడని పలువురు చెప్పారు, కానీ సినిమా మాత్రం ఆడియన్స్‌కి సేట్ కాలేదు.
మొత్తానికి, విశ్వనాథన్ ఆనంద్ పాత్రతో దుల్కర్ మరోసారి తన వర్సటాలిటీని ప్రూవ్ చేయబోతున్నాడు. సౌత్‌లో భారీ పాపులారిటీ సంపాదించిన దుల్కర్ కెరీర్లో ఈ బయోపిక్ కూడా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
రీల్ విశ్వనాథన్ ఆనంద్ ఆడే “గేమ్” ఎలా ఉంటుందో చూడాల్సిందే. క్రీడాకారుల జీవితం తెర మీద చూపించడం పెద్ద సాహసమే అయినా, దుల్కర్ మాత్రం ఈ పాత్రపై చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాడని తెలుస్తోంది.
Recent Random Post:














