దుల్కర్ @ 40: స్టార్‌గా ఎదుగుతున్న మమ్ముట్టి వారసుడు

Share


మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఇప్పటికే 400 సినిమాల ఘన కిరీటం సొంతం చేసుకున్నారు. ఐదు దశాబ్దాల నటజీవితం, మూడు షిఫ్టులు వేసే కష్టసాధ్యమైన పట్టుదల వల్లే ఇది సాధ్యమైంది. 1971లో సినీ ప్రయాణం ప్రారంభించిన మమ్ముట్టి వయస్సు ఏడుపదుల దాటినా ఇప్పటికీ సమాన ఉత్సాహంతో సినిమాల్లో నటిస్తున్నారు. మలయాళంతో పాటు తమిళం, తెలుగులోనూ ఆయన గుర్తింపు పొందారు.

ఇప్పుడు ఆయన తేజస్వి వారసుడు దుల్కర్ సల్మాన్ కూడా తనదైన శైలిలో మెరుగైన మైలురాయికి చేరుకున్నాడు. కేవలం 13 ఏళ్లలోనే 40 సినిమాలు పూర్తి చేశాడు. 2012లో ‘సెకండ్ షో’ చిత్రంతో తెరంగేట్రం చేసిన దుల్కర్, అప్పటి నుంచి ఆగకుండా సినిమాలు చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగాడు.

తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్న ‘సీతారామం’ ద్వారా అతడు టాలీవుడ్‌లో తన స్థానం దృఢం చేసుకున్నాడు. ఆ సినిమాతోనే తెలుగు అభిమానులు దుల్కర్‌ను తమ నటుడిగా భావించడం మొదలుపెట్టారు. తర్వాతి హిట్ ‘లక్కీ భాస్కర్’ తో మరింత ప్రజాదరణ సంపాదించాడు. దాంతో తెలుగులో సినిమాలపై ఆసక్తి పెంచుకున్న దుల్కర్ ప్రస్తుతం “ఆకాశంలో ఒక తార” అనే చిత్రం చేస్తున్నాడు.

అతడి 40వ చిత్రం ‘ఐ యామ్ గేమ్’ అనే యాక్షన్ థ్రిల్లర్. ఇందులో హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. నహాస్ ఇదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల తిరువనంతపురంలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇది దుల్కర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్‌గా నిలవనుంది.


Recent Random Post: