ధనుష్‌కు ‘కుబేర’లో సవాళ్లతో కూడిన ప్రయాణం

Share


కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ఇప్పటికే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. బాలీవుడ్‌లో సైతం ‘రాంజానా’ వంటి హిట్ సినిమాతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను కలిగి ఉన్నాడు. ధనుష్ స్థాయిలో ఇప్పటివరకు ఏ కోలీవుడ్ హీరో హిందీ మార్కెట్‌లో అంతటి గుర్తింపు పొందలేదు.

ప్రస్తుతం ‘కుబేర’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఈడీ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, గ్లింప్స్‌లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో ధనుష్ యాచకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ సందర్భంగా ధనుష్ తన అనుభవాలను పంచుకుంటూ మాట్లాడుతూ – “ఈ పాత్ర కోసం చాలా రీసెర్చ్ చేశా. కానీ హోంవర్క్ చేశానా అంటే మాత్రం చెప్పను (నవ్వుతూ). శేఖర్ కమ్ముల చెప్పిన విధంగా చేస్తూ వెళ్లిపోయాను. సవాళ్లతో కూడిన ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాను. షూటింగ్ నాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. కొన్ని సన్నివేశాలు నా బాల్యాన్ని గుర్తు చేశాయి. ఒక సన్నివేశానికి నేను, రష్మిక కలసి డంపింగ్ యార్డులో 7 గంటల పాటు నటించాం. అక్కడ తాను బాగానే ఉంది అని చెప్పింది. నాకైతే ఎలాంటి అసౌకర్యం రాలేదు. ఆమెకు ఏమైంది నాకు తెలియదు (నవ్వుతూ),” అని చెప్పాడు.


Recent Random Post: