
గత కొంత కాలం సక్సెస్ లేక చాలా ఇబ్బంది పడిన నాగ చైతన్య, ఈ ఏడాది తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం చైతన్య కెరీర్ లో ఒక సంచలన విజయంగా నిలిచింది. ప్రస్తుతం చైతన్య తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.
నాగ చైతన్య తన తదుపరి సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం చైతన్య కెరీర్ లో 24వ మూవీగా తెరకెక్కుతుంది. భారీ వీఎఫ్ఎక్స్ తో ఈ సినిమా రూపొందుతుందని చైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
అదే సమయంలో, నాగ చైతన్య తన ఫుడ్ బిజినెస్ గురించి కూడా మాట్లాడాడు. చైతన్య గత కొన్నాళ్లుగా ఫుడ్ బిజినెస్‌లో రాణిస్తోన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో “షోయు” అనే రెస్టారెంట్‌ను ప్రారంభించి, రుచికరమైన వంటకాలను ప్రజలకు అందిస్తున్నాడు. ఇటీవల “దేవర” జపాన్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ కూడా తన రెస్టారెంట్ గురించి మాట్లాడి, హైదరాబాద్‌లోని ఫేవరెట్ రెస్టారెంట్స్‌లో ఒకటిగా “షోయు”ను పేర్కొన్నాడు. అతను, “హైదరాబాద్‌లో జపానీస్ ఫుడ్ చాలా బావుంటుంది, సుషీని అందులో తినొచ్చు” అని చెప్పి, ఈ రెస్టారెంట్ గురించి మంచి రివ్యూ ఇచ్చాడు.
ఈ విషయం గురించి చైతన్య మాట్లాడుతూ, “ఎన్టీఆర్ మా రెస్టారెంట్ గురించి మాట్లాడి, ఫుడ్ బావుంటుందని చెప్పిన వీడియో చూసిన రోజున నాకు చాలా ఆనందం అనిపించింది” అని చెప్పాడు. “షోయు” రెస్టారెంట్ ప్రారంభించాలనే ఆలోచన లాక్డౌన్ సమయంలో వచ్చినట్లు చైతన్య వెల్లడించారు. ప్రస్తుతం తన రెస్టారెంట్ బాగా పనిచేస్తోంది అని కూడా చెప్పారు.
Recent Random Post:















